E-Paper
Advertisement

రూ.83 కోట్ల లంచం ఆఫర్… వందల మంది గ్యాంగ్‌స్టర్లు వెంట… ఎల్ చాపో అరెస్ట్ కథ ఇదే

రూ.83 కోట్ల లంచం ఆఫర్… వందల మంది గ్యాంగ్‌స్టర్లు వెంట… ఎల్ చాపో అరెస్ట్ కథ ఇదే
Advertisement

Mexican Crime Thriller: ఒక నార్మల్ రోడ్డు చెకింగ్… దొంగిలించిన కారును ఆపిన ఇద్దరు పోలీసులు… కానీ ఆ కారులో ఉన్న వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ లార్డ్ అని తెలిస్తే ? అతన్ని అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే వందల మంది గ్యాంగ్‌స్టర్లు తమ వెంట పడితే ? కోట్ల రూపాయల లంచాన్ని తిరస్కరించి, ఆ కరడుగట్టిన నేరస్థుడిని సురక్షితంగా అధికారులకు అప్పగించాల్సి వస్తే ? ఇదే నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మెక్సికన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఫేసింగ్ ఎల్ చాపో’ (Facing El Chapo). మరి ఎల్ చాపోను పోలీసులు ఎలా పట్టుకున్నారు ? ఆ ఇద్దరు అధికారులకు ఎదురైన అసలు ప్రమాదం ఏంటి ? తెలుగులో ఈ సినిమా ఉందా? ఎక్కడ చూడొచ్చు? తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ 2016 జనవరిలో మెక్సికోలోని లాస్ మోచిస్, సినాలోవా ప్రాంతంలో మొదలవుతుంది. ఫెడరల్ పోలీస్ అధికారులు ఆర్టురో కార్మోనా, హెక్టర్ రోసాలెస్ పెట్రోలింగ్‌లో ఉంటారు. అనుమానంగా కనిపించిన ఓ వాహనాన్ని ఆపడంతో వాళ్ల డ్యూటీ ఒక్కసారిగా ప్రాణాల మీదకు వస్తుంది. ఆ కారుపై దొంగతనం కేసు ఉండటంతో పోలీసులు తనిఖీ చేస్తారు. కారులో ఉన్న వ్యక్తిని గుర్తించిన వెంటనే వాళ్లకు అసలు షాక్ తగులుతుంది. అతను సాధారణ నేరస్థుడు కాదు… ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకడైన జోక్విన్ “ఎల్ చాపో” గుజ్‌మాన్. సీనలోవా కార్టెల్‌కు కీలక నాయకుడైన అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు.

Advertisement

అక్కడి నుంచే అసలు ప్రమాదం మొదలవుతుంది. ఎల్ చాపో పట్టుబడ్డాడనే వార్త కార్టెల్‌కు చేరుతుంది. అతన్ని విడిపించేందుకు గ్యాంగ్‌స్టర్లు ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. మరోవైపు పోలీసులు మాత్రం ఎల్ చాపోను సురక్షితంగా అధికారుల చేతికి అప్పగించాలి. ఇంతలో వాళ్లకు భారీ లంచం ఆఫర్ వస్తుంది. ఎల్ చాపోను విడిచిపెడితే 50 మిలియన్ డాలర్ల వరకు డబ్బు ఇస్తామనే ప్రతిపాదన ఎదురవుతుంది. ఒకవైపు జీవితాన్ని మార్చేసేంత డబ్బు… మరోవైపు చట్టం, బాధ్యత, ప్రాణాల ప్రమాదం. ఆ ఇద్దరు అధికారులు తీసుకోవాల్సిన నిర్ణయం మరింత కఠినంగా మారుతుంది.

ఎల్ చాపోను పట్టుకోవడం కంటే అతన్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడమే అసలైన సవాల్. కార్టెల్ ఎప్పుడు దాడి చేస్తుందో తెలియదు. చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తిని అనుమానించాల్సిన పరిస్థితి. ఒక్క చిన్న పొరపాటు జరిగినా ఎల్ చాపో చేతులు దాటిపోవడంతో పాటు, పోలీసుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి. మరి ఆ ఇద్దరు పోలీసులు కోట్ల లంచాన్ని తిరస్కరించారా ? ఎల్ చాపోను నిజంగానే సురక్షితంగా అప్పగించగలిగారా ? కార్టెల్ వాళ్లపై ఎలా ఒత్తిడి తీసుకొచ్చింది ? ఆ రాత్రి జరిగిన అసలు ఆపరేషన్ ఎలా ముగిసింది ? అనేదే ఈ సినిమాలోని అసలు ఉత్కంఠ.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ?

Advertisement

‘ఫేసింగ్ ఎల్ చాపో’ ఆగస్టు 21 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా అసలు స్పానిష్ టైటిల్ La Captura. సుమారు 1 గంట 31 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రంలో Alfonso Herrera, Noé Hernández, Héctor Kotsifakis ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్పానిష్‌తో పాటు ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్ వంటి భాషలలో ఈ సినిమా అందుబాటులో ఉంది. కానీ తెలుగులో మాత్రం లేదు. ఎల్ చాపో అరెస్ట్ వెనుక జరిగిన పోలీస్ ఆపరేషన్, కార్టెల్ బెదిరింపులు, భారీ లంచం, ప్రాణాలకు తెగించి తీసుకున్న నిర్ణయాలతో ఉన్న ఈ ఫాస్ట్‌పేస్డ్ మూవీ క్రైమ్ థ్రిల్లర్స్ ను ఖచ్చితంగా మెప్పిస్తుంది.

Read Also: ప్రజలనే ఆయుధంగా మార్చి దేశాన్ని కూల్చే కుట్ర… విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’ తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Tags

Related News

ప్రేమ పేరుతో మెంటలెక్కించే పనులు… ఎక్స్ రీఎంట్రీతో బుర్రపాడు ట్విస్ట్… ఈ లవ్ ట్రయాంగిల్ చూస్తే బుర్రపాడు

నేరస్థుల గుండెల్లో వణుకు పుట్టించే స్పెషల్ టీమ్… కంటెంట్ నెక్స్ట్ లెవెల్ భయ్యా… డెడ్లీ క్రైమ్స్ తో సీజన్ 9 స్ట్రీమింగ్ షురూ

పాపులర్ SNL షో వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ కథ… ఇండస్ట్రీ సీక్రెట్స్ బయటపెట్టిన నెట్‌ఫ్లిక్స్ కొత్త డాక్యుమెంటరీ

కులం పిచ్చితో ప్రేమికుల ప్రాణాలు తీసే రాక్షసత్వం… హార్డ్ హిట్టింగ్ మూవీ

తీరప్రాంతాన్ని వణికించే మిస్టరీ క్రియేచర్… ఊరిని కాపాడుకోవడానికి మత్స్యకారుడి పోరాటం… గూస్‌బంప్స్ తెప్పిస్తున్న సర్వైవల్ థ్రిల్లర్

యూనికార్న్ ఐలాండ్‌లో ఊహించని విపత్తులు… ఆ వింత రహస్యం ఏంటి ? నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త మ్యాజికల్ అడ్వెంచర్

అవుట్‌వర్ల్డ్ క్రూర చక్రవర్తిపై తిరుగుబాటు… హాలీవుడ్ హీరో ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ వార్… తెలుగులోనే స్ట్రీమింగ్

విలన్ గా సుహాస్ 150 కోట్ల మాస్ ర్యాంపేజ్… తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మందాడి’

Big Stories

Advertisement
×