Hyderabad News: శుక్రవారం ముస్లింలు జరుపుకునే మిలాద్ ఫెస్టివల్, శనివారం గణేష్ నిమజ్జనం కావడంతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. వరుసగా రెండు పండుగలు రావడంతో భద్రతను సమీక్షించారు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్.
మంగళవారం సాయంత్రం కమిషనర్ ఆఫీసులో వివిధ జోన్ల పోలీసు అధికారులతో సమీక్ష చేపట్టారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో మిలాద్ ఫెస్టివల్‌ను జరుపుకుంటారు. ఈద్ మిలాద్-ఉన్-నబి లేదా మిలాద్-ఉన్-నబి అని పిలుస్తారు.
ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి. ఇస్లామిక్ చంద్రమాన క్యాలెండర్‌లోని మూడో నెల రబీ అల్-అవ్వల్‌లో జరుపుకుంటారు. ముఖ్యంగా సూఫీ-బరేల్వీ వర్గాలు దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రవక్త ముహమ్మద్ జన్మదినోత్సవాన్ని మిలాద్ ఫిస్టెవల్ సూచిస్తుందని చెబుతారు.
ప్రతీ ఏడాది సెప్టెంబర్ 4 లేదా 5 చుట్టూ వస్తుంది. ఈసారి సెప్టెంబర్ ఐదున వచ్చింది. శుక్రవారం మిలాద్ ఫెస్టివల్ జరగనుంది. మరసటి రోజు అంటే శనివారం హైదరాబాద్ సిటీలో గణేష్ నిమజ్జనం జరగనుంది. వరుసగా ముస్లిం, హిందువుల పండుగ రావడంతో సిటీ కమిషనర్ దృష్టి పెట్టారు.
ALSO READ: కవిత పదవికి రాజీనామా చేస్తారా? మీడియా సమావేశం ఏం చెబుతారు?
భద్రత విషయం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రెండు పండుగలు ముఖ్యమైనవి కావడంతో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకూడదన్నారు. దీంతో జోన్ల వారీగా సమీక్షలు పూర్తి అయ్యాయి. అధికారులంతా నమ్మకంగా, సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నారని చెప్పారు. మిలాద్, గణేష నిమజ్జనం సమయంలో ప్రజా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నొక్కి చెప్పారు.
జేబు దొంగతనం, వేధింపులు, చైన్ స్నాచింగ్ వంటి నేరాలను నివారించడానికి పోలీసు బృందాలు, షీ టీమ్స్, వాలంటీర్లు 24 గంటలూ నిఘా ఉంచాలన్నారు. ముందు జాగ్రత్త చర్యగా నిర్వాహకులు-వాలంటీర్లు రాత్రిపూట గణేష్ మండపాల వద్ద ఉండాలని సూచించారు. గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా భక్తులు-ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు కూకట్‌పల్లి రంగథాముని చెరువును పరిశీలించారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి. వినాయక నిమజ్జనాల ఏర్పాట్ల పరిశీలించారు. గణేష్ నిమజ్జం కోసం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 6 వేల మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గస్తీతోపాటు సీసీటీవీ పర్యవేక్షణ ఉండాలన్నారు.
కూకట్‌పల్లి రంగథాముని చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి..
వినాయక నిమజ్జనాల ఏర్పాట్ల పరిశీలన
గణేష్ నిమజ్జనాల కోసం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధుల్లో 6 వేల మంది పోలీసులు
ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు
అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ… pic.twitter.com/xIwKN1042p
— BIG TV Breaking News (@bigtvtelugu) September 3, 2025