Kavitha: బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరాయా? పార్టీ నుంచి కేసీఆర్ తన కుమార్తె కవితను సస్పెండ్ వెనుక ఏం జరిగింది? ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు కవిత సిద్ధమయ్యారా? ఆమె రాజకీయ ప్రయాణం ఇకపై ఎటు? బుధవారం మీడియా ముందు ఆమె ఏం చెప్పనున్నారు? ఇవే ప్రశ్నలు బీఆర్ఎస్ నేతలను వెంటాడుతున్నాయి.
బీఆర్ఎస్‌లో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరాయి. ఈ వ్యవహారంపై తొలిసారి నోరు విప్పారు ఎమ్మెల్సీ కవిత. ఆమె మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి కొత్త విషయాలు బయటపెడుతున్నారు. పార్టీ వ్యవహారాలపై అధినేతకు రాసిన లేఖ మొదలు ఒకొక్కటిగా చెప్పుకొంటూ వచ్చారు. తొలుత జగదీష్‌రెడ్డి, ఆ తర్వాత హరీష్‌రావు, సంతోష్ గురించి కొత్త విషయాలు బయటపెట్టారు.
ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్, కూతుర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఓ ప్రకటన చేశారు. సస్పెండ్ అనేది పార్టీలు చేసే మొదటి పని. బహిష్కరిస్తే అప్పుడు చర్చించాలని, కేవలం సస్పెండ్ చేస్తే ఫలితం ఉండదని అంటున్నారు. తండ్రి పార్టీలోకి కూతురు ఎప్పుడైనా రావచ్చని అంటున్నారు. ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశం కాదని అంటున్నారు.
ఆమె సస్పెండ్ వెనుక చాలా పెద్ద తతంగం నడిచింది. బీఆర్ఎస్ కీలక నేతలు ఒక రోజంతా ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో ఉన్నారు. కవిత వ్యవహారంపై పలుమార్లు అధినేత కేసీఆర్‌తో చర్చించారు. సస్పెండ్ చేయకముందు చాలా విషయాలను కవిత బయటపెట్టిందని, ఒకవేళ చేస్తే ఇంకెన్ని విషయాలు బయటపెడుతుందోనని కొందరు నేతలు కేసీఆర్ దృష్టికి తెచ్చారు.
ALSO READ: షర్మిల వచ్చి నా కుర్చీలో కూర్చోండమ్మా- సీఎం రేవంత్
ఆమె ఏమి మాట్లాడినా స్పందించకూడదని అధిష్టానం నుంచి నేతలకు సంకేతాలు వెళ్లినట్టు తెలుస్తోంది. ఆమె మాటలపై నోరు ఎత్తితే పెద్ద రచ్చ అవుతుందని, మిగతా పార్టీలు వాటి గురించి పదే పదే ప్రస్తావించే అవకాశం ఉందని అన్నారట పెద్దాయన.
ఇక కవిత సస్పెండ్ విషయం తెలియగానే ఆమె నివాసానికి మద్దతుదారులు, జాగృతి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. బీఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ వ్యవహారం బీఆర్ఎస్‌లో చర్చకు దారితీసింది. ఈక్రమంలో కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారంటూ బీఆర్ఎస్ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. అందులో నిజమెంతో తెలీదు.
కాకపోతే ప్రజల అటెక్షన్‌ని డ్రైవర్ట్ చేసేందుకు ఈ స్కెచ్ వేశారని అంటున్నారు. మరి బుధవారం మధ్యాహ్నం మీడియా ముందుకు రానున్న కవిత, బీఆర్ఎస్ పార్టీ గురించి కొత్త విషయాలు బయటపెడతారు? పార్టీ లోగుట్టు బయటపెడతారా? అన్నది చూడాలి.