BigTV English

Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత.. ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత.. ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

Hyderabad: తెలంగాణలో వర్షం కుండపోతగా కురుస్తున్నది. పలు జిల్లాల్లో సహా రాజధాని హైదరాబాద్ నగరంలోనూ భారీగా వర్షం పడుతున్నది. హైదరాబాద్‌లో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలో వెంటనే జలమయం అయ్యాయి. వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా చోట్ల రోడ్లు కూడా నీటమునిగిపోయాయి. ఇలాంటి కారణాలతో పలు చోట్ల ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.


హైదరాబాద్‌లో భారీగా వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ ప్రజల కోసం ప్రభుత్వం సహాయం అందించడానికి కంట్రోల్ రూమ్ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. ప్రజలకు ఏదైనా అత్యవసర సహాయం కావాలంటే 040-2111 1111కు డయల్ చేయాలని పేర్కొంది. సికింద్రాబాద్, దిల్‌సుఖ్ నగర్, చైతన్యపురి, బీఎన్ రెడ్డి నగర్, పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపుర్‌మెంట్, చింతల్, కొంపల్లి, దుండిగల్, కొత్తపేట, సుచిత్ర, కూకట్‌పల్లి, మూసాపేట్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అల్వాల్, బొల్లారం, జవహర్ నగర్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది.

ఈ ఏరియాల్లో భారీ ట్రాఫిక్
అమీర్ పేట్ నుంచి లక్డీకాపూల్ వరకు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే.. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ దగ్గర కూడా భారీ వర్షం కురిసింది. ఇక్కడా ట్రాఫిక్ ఎక్కువే ఉన్నది. ఐకియా సర్కిల్ దగ్గర, కూకట్‌పల్లి, హైటెక్ సిటీ దగ్గర కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.


Also Read: Revanth Reddy: మీ విజన్ సూపర్.. ప్రభుత్వంపై ఫాక్స్‌కాన్ చైర్మన్ ప్రశంస

ఇక జిల్లాల్లో కూడా కుండపోతగా వర్షం కురుస్తున్నది. అత్యధికంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో కురిసింది. చిగురుమామిడిలో అత్యధికంగా 14 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లాలో 12.6 సెంటిమీటర్ల వర్షం పడింది. కామారెడ్డిలో 10.5 సెంటిమీటర్లు, శనిగరంలో 9.1 సెంటిమీటర్లు, జగిత్యాల జిల్లా పూడురులోన 8.9 సెంటిమీటర్ల వర్షం పాతం నమోదైంది.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×