Big Stories

TSRTC: హైదరాబాద్ లో ఆర్టీసీని మహిళలు తెగ వాడేస్తున్నారు.. 8 కోట్లకు చేరిన జీరో టికెట్లు..!

TSRTC:

- Advertisement -

TSRTC: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఉచితంగా బస్సు ప్రయాణం అందుబాటులోకి తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. అంతే కాదు ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లకు పెంచింది. అయితే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మహిళలు భారీగా ఉపయోగించుకుంటున్నారు తెలంగాణ మహిళలు.

- Advertisement -

ఉచిత బస్సు ప్రయాణం పథకం తీసుకొచ్చినప్పటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ జోన్ లో ఇప్పటి వరకు 8కోట్ల ఉచిత ప్రయాణ టికెట్లు జారీ చేసినట్లు ఆర్టీసీ తెలిపింది.మొన్న సోమవారం రికార్డు స్థాయిలో 12లక్షల మంది మహిళలు గ్రేటర్ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించారు. బస్సుల సంఖ్య పెరిగతే మహిళ ప్రయాణికుల సంఖ్య పెరిగి అవకాశం ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు. టికెట్ కు రూ. 10వేసుకున్నా ఆర్టీసీకి రూ.80 కోట్ల ఆదాయం వస్తుంది.

ఉచిత ప్రయాణంతో గ్రేటర్ లో ఆర్టీసికి బస్సుల ఆక్యుపెన్సీ 100 శాతానికి పెరిగినట్లు చెబుతున్నారు అధికారు. మహిళలకు ఫ్రీ జర్నీ లేనప్పడు ఆక్యుపెన్సీ 70శాతం మాత్రమే ఉండేదట. అయితే మహిళలకు అవసరం లేకున్నా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీని వల్ల పురుషులు ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. కొంత మంది మహిళలు కూరగాయలు, చిన్నచిన్న పనులకు కూడా బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు ఆరోపనలు వినిపిస్తున్నాయి.

Read More: మేడారం జాతర హుండీ లెక్కిపు ప్రారంభం..

ఉచిత బస్సు ప్రయాణికులకు సంబంధించి పలు నిబంధనలు తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. ఉచిత ప్రయాణాన్ని పల్లె వెలుగులకే పరిమితం చేయాలంటున్నారు పలువురు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఫ్రీ ఇచ్చినా.. 50శాతం రాయితీ ఇస్తే సరిపోతుందని చెబుతున్నారు. ఇక హైదరాబాద్ సిటీ బస్సుల్లో టికెట్ రూ. 10వసూలు చేయాలని కోరుతున్నారు. ఇలా చేయడం వల్ల బస్సుల్లో ఫ్రీ ఇచ్చినా.. 50శాతం రాయితీ ఇస్తే సరిపోతుందని చెబుతున్నారు. ఇక హైదరాబాద్ సిటీ బస్సుల్లో టికెట్ రూ. 10 వసూలు చేయాలని కోరుతున్నారు. ఇలా చేయడం వల్ల అవసరం ఉన్నవారే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారని చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News