E-Paper
Advertisement

జీవితంలో ఇంకెప్పుడు వంట చేయకూడదని ఆమెకు ప్రభుత్వం షరతు.. ఆ దీవిలో 30 ఏళ్లు బందీ!

జీవితంలో ఇంకెప్పుడు వంట చేయకూడదని ఆమెకు ప్రభుత్వం షరతు.. ఆ దీవిలో 30 ఏళ్లు బందీ!
Advertisement

మీకు వంట వచ్చా? వెంటనే నేర్చుకోండి. లేకపోతే.. మీ వంట మనిషి చేతిలో చావును కొనుతెచ్చుకొనే ప్రమాదం ఉంది. దీనికి అర్థం ఆమే.. ప్లాన్ చేసి.. వంటలో విషం కలిపి చంపేస్తాదని కాదు. ఆమెకు తెలియకుండానే.. ఆమె మరణానికి కారణం అవుతుంది. అదెలా అనుకుంటున్నారా? అయితే.. మీరు తప్పకుండా ఆమె గురించి తెలుసుకోవల్సిందే.

న్యూయార్క్ నగరంలో…

ఆమె గురించి మీరు తెలుసుకోవాలంటే.. ముందుగా మీరు న్యూయార్క్ నగరంలోని ఈస్ట్ రివర్‌లో ఉన్న ‘నార్త్ బ్రదర్’ ఐలాండ్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే.. ఇది ఒకప్పుడు ప్రపంచాన్ని భయపెట్టిన ఒక చిత్రమైన ఘటనకు మౌనసాక్షి. వైద్య చరిత్రలోనే అత్యంత విచిత్రమైన ఘటనకు వేదిక. అదేంటో తెలుసుకుంటే.. ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు చాలా థ్రిల్‌గా ఫీలవుతారు.

ఆమె వంట చేస్తే మరణమే..

Advertisement

మేరీ మల్లాన్ గురించి అమెరికాలో ఎవరిని అడిగినా చెబుతారు. 1869లో ఉత్తర ఐర్లాండ్‌లో జన్మించిన మేరీ మల్లన్.. అమెరికాకు వలస వచ్చి.. ఇళ్లల్లో వంటలు చేస్తూ జీవితం సాగించేది. 1906లో ఆమె వంట మనిషిగా పనిచేస్తున్న ఇంట్లో అకస్మాత్తుగా ఆరుగురు చనిపోయారు. ఏమిటా అని ఆరా తీస్తే.. వారికి టైఫాయిడ్ వచ్చిందని తెలిసింది. చిత్రం ఏమిటంటే వారి ఇల్లు చాలా పరిశుభ్రంగా ఉండేది. అలాంటప్పుడు వారికి టైఫాయిడ్ వచ్చే ఛాన్సే లేదు. దీంతో ఆ వ్యాధి వారికి ఎలా వచ్చిందో అర్థం కాక.. జార్జ్ సాపర్ అనే ఇంజినీరు దీనిపై దర్యాప్తు చేశాడు. చివరికి మేరీ వల్లే వాళ్లు చనిపోయారని తెలుసుకున్నాడు. దీంతో ఆమెను పనిలో నుంచి తొలగించారు.

లక్షణాలు లేకపోయినా.. టైఫాయిడ్

మేరీ ఎక్కడ పనిచేస్తే అక్కడ టైఫాయిడ్ సోకేది. ఆమె వంట చేసిన ఇళ్లల్లో జనాలు టైఫాయిడ్ సోకి చనిపోయేవారు. ఒక వేళ మేరీకి టైఫాయిడ్ ఉండి ఉంటే ఆమె కూడా చనిపోవాలి. కానీ, అలా జరిగేది కాదు. చిత్రం ఏమిటంటే.. ఆమెలో ఎక్కడా ఆ రోగ లక్షణాలేవీ కనిపించేవి కావు. దీంతో వైద్యులు బుర్ర పట్టుకున్నారు. ఎట్టకేలకు అసలు విషయం తెలుసుకున్నారు. ఈ అరుదైన పరిస్థితిని వైద్య శాస్త్రంలో ‘అసింప్టోమాటిక్ క్యారియర్’ అని అంటారు. మేరీ శరీరంలోని పిత్తాశయంలో సాల్మోనెల్లా టైపీ బ్యాక్టీరియా ఉండేది. ఆమెకు వ్యాధి లేకపోయినా.. వంటే చేసే ముందు చేతులు సరిగ్గా కడుక్కోకపోవడం వల్ల ఆ వ్యాధి ఇళ్లలోవారికి సాగేది. ముఖ్యంగా ఐస్ క్రీమ్ విత్ పీచ్, పండ్లను ముట్టుకోవడం వల్ల అది ఇతరులకు సులభంగా సోకేది. ఆమె వల్ల ఎప్పటికైనా ప్రమాదమే అని గ్రహించి.. అధికారులు దారుణమైన నిర్ణయం తీసుకున్నారు.

మనుషుల్లేని దీవిలో 30 ఏళ్లు క్వారంటైన్

Advertisement

కోవిడ్ పేషెంట్లను ఉంచినట్లుగానే.. మేరీని న్యూయార్క్‌లోని నార్త్ బ్రదర్ ఐలాండ్‌లో మొదటిసారి క్వారంటైన్ చేశారు. 1910లో ఇకపై వంట చేయను అనే షరతుపై సంతకం పెట్టించుకుని విడుదల చేశారు. కానీ, ఆమె 1915లో తన పేరును ‘మేరీ బ్రౌన్’ అని మార్చుకుని ఓ ఆసుపత్రిలో వంట మనిసిగా చేరింది. దానివల్ల ఒకేసారి 22 మందికి టైఫాయిడ్ వ్యాధి సోకింది. వారిలో ఇద్దరు చనిపోయారు. ఈ విషయం తెలియగానే ఆమె అధికారుల కళ్లుగప్పి అక్కడి నుంచి తప్పించుకుంది. మారు పేర్లతో వివిధ ఇళ్లల్లో పనిచేస్తూ ఎంతో మందిని మరణాలకు కారణమైంది. చివరిగా 1938లో అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని అదే దీవికి తరలించారు. అక్కడే సుమారు 30 ఏళ్లు ఒంటరిగా జీవించి.. 69 ఏళ్ల వయస్సులో మరణించింది.

Also Read: ‘ఇరుముడి’ మూవీలోని ఈ లోకేషన్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా? ఫిదా అయిపోతారు!

ఆ తర్వాత ఆ దీవిలో హాస్పిటల్ భవనాలు వెలిశాయి

మొదట్లో ఆ దీవిని రోగులను క్వారంటైన్ ఉంచేందుకు ఉపయోగించేవారు. ఆ తర్వాత అక్కడ వారికి చికిత్స అందించేందుకు హాస్పిటల్స్ నిర్మించారు. అయితే.. కొన్నాళ్ల తర్వాత ఆ హాస్పిటల్ భవనాలు శిథిల స్థితికి చేరుకున్నాయి. ఇప్పుడు అక్కడ దట్టమైన పొదలు, రావి చేట్ల వేళ్లతో నిండిపోయాయి. ఆ ప్రాంతంలో అడుగుపెడితే.. ఒక రకమైన భయానక అనుభూతి కలుగుతుంది. న్యూయార్క్ సిటీ పార్క్స్ డిపార్ట్‌మెంట్ ప్రస్తుతం అక్కడ పక్షుల సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. అయితే, ఇప్పటికీ అక్కడికి సాధారణ పర్యటకులను అనుమతించరు. ఈస్ట్ రివర్ ఒడ్డున నిలబడి చూడాల్సిందే. కాంక్రీట్ జంగిల్ మధ్య.. పచ్చని చుక్కలా ఆ దీవి మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.

Tags

Related News

విమానాల టైర్లకు కార్లలా జిగ్‌జాగ్ గాడులు ఎందుకు ఉండవు? అసలు కారణం ఇదే!

1871లో మనుషుల్లేని ద్వీపంలోకి 5 ఆవులు.. 137 ఏళ్ల తర్వాత అక్కడ ఉన్నది చూసి.. శాస్త్రవేత్తలే షాక్!

అమెరికా To బ్రిటన్.. భారతీయులు ఎక్కువగా ఉన్న టాప్ – 7 దేశాలు.. లెక్కలు చూస్తే షాకే!

విమానంలో భోజనాలేందిరా? ఇదేమైనా బస్సు, రైలు అనుకున్నారా? వీడియో వైరల్!

నడవలేము మహాప్రభో.. ప్రపంచ ‘బద్దకస్తుల’ జాబితాలో.. భారత్ స్థానం ఎంతంటే?

100 కి.మీ నిర్మాణం పూర్తి.. బుల్లెట్ రైలు కల సాకారం దిశగా కీలక ముందడుగు!

వైష్ణోదేవి నుంచి తిరుపతి వరకు.. ఇక్సిగో కొత్త ‘భారత్ దర్శన్’ ప్యాకేజీలు!

Big Stories

Advertisement
×