E-Paper
Advertisement

బిగ్‌బాస్ హౌస్‌లో తనకు ఎదురైన ఘటనపై సోనియా ఆకుల ఓపెన్

బిగ్‌బాస్ హౌస్‌లో తనకు ఎదురైన ఘటనపై సోనియా ఆకుల ఓపెన్
Advertisement

kissik-talks: ఇప్పటి వరకు వచ్చిన సీజన్ లలో ఆసక్తికరమైన సీజన్ లలో ఒకటి బిగ్‌బాస్ సీజన్-8. ఈ సీజన్ అనగానే చాలామందికి గుర్తుకొచ్చే కాంట్రవర్షియల్ కంటెస్టెంట్లలో సోనియా ఆకుల పేరు ఖచ్చితంగా మొదటి వరుసలో ఉంటుంది.

హౌస్‌లో ఉన్నంత కాలం తన స్ట్రైట్ ఫార్వర్డ్ ఆటిట్యూడ్‌తో, ఇతర కంటెస్టెంట్లతో గొడవలతో సోనియా సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్‌లో నిలిచింది.బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ భామ చుట్టూ ఉన్న ఆ వివాదాలు అంత ఈజీగా మానలేదు.

కొన్ని విషయాలు మాత్రం

Advertisement

ఇక ఇదే విషయంపై బిగ్ టీవీ నిర్వహించిన కిస్సిక్ టాక్స్ లో తనకి ఎదురైన అనుభవాలని పంచుకుంది సోనియా. సోనియా మాట్లాడుతూ”నేను సాధారణంగా చాలా సైలెంట్‌గా ఉంటాను..ఎవరైనా ఏమైనా అన్నా పటించుకోకుండా కామ్‌గా ఉండటానికి ప్రయత్నిస్తాను. కానీ కొన్ని విషయాలు మాత్రం నన్ను తీవ్రంగా ట్రిగ్గర్ చేస్తాయి!” అంటూ సోనియా ఆ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కొన్ని సంఘటనల వల్లే

మనకు స్క్రీన్ మీద కనిపించే చిన్న గొడవ వెనుక హౌస్‌లో ఉండే అసలు వాతావరణం చాలా వేరుగా ఉంటుందని సోనియా చెబుతున్న మాటలని బట్టి అర్థం అవుతున్నాయి. ముఖ్యంగా తన మనసుకి బాగా టచ్ అయిన, తన పర్సనల్ స్పేస్‌ను క్రాస్ చేసిన కొన్ని సంఘటనల వల్లే తాను అంతగా ఎమోషనల్ అయ్యానని, అంతేకానీ తాను ప్రతి చిన్న విషయానికీ గొడవపడే వ్యక్తిని కాదంటూ ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చింది సోనియా.

 జడ్జ్ చేయడం చాలా సులభం

Advertisement

ఈ సోషల్ మీడియా జమానాలో కేవలం ఒక చిన్న క్లిప్‌ని చూసి ఒకరి క్యారెక్టర్‌ని జడ్జ్ చేయడం చాలా సులభం. కానీ ఆ క్షణంలో ఆ వ్యక్తి అనుభవించిన ఒత్తిడి, ఆ మాట అన్న సందర్భం తెలిస్తే తప్ప అసలు నిజం బయటకు రాదు. ఇప్పుడు సోనియా కూడా ఇదే పాయింట్‌ను వేలెత్తి చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. మొత్తంగా అప్పట్లో బిగ్‌బాస్ లవర్స్ ఏ సంఘటననైతే పట్టుకుని ఆమెపై విపరీతంగా ట్రోలింగ్ చేశారో, అదే సంఘటన వెనుక ఉన్న అసలు సీక్రెట్‌ను ఇప్పుడు ఆమె ఈ ఇంటర్వ్యూలో బయటపెట్టబోతుందన్న మాట.

సోషల్ మీడియాలో తెగ వైరల్

మరి అసలు సోనియాను అంతలా ఎమోషనల్ చేసి, ట్రిగ్గర్ చేసిన ఆ మాటలు ఎవరివి? ఆ రోజు కెమెరాలకు చిక్కని ఆ సంఘటనలు ఏంటి ? వంటి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే మాత్రం ఆదివారం రాత్రి 8-30కి టెలీకాస్ట్ అయ్యే ఈ ఫుల్ ఇంటర్వ్యూని చూసేయ్యల్సిందే.

also read :సోనియా ఆకుల భర్త బ్యాక్‌గ్రౌండ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

మొత్తానికి “నేను కామ్‌గా ఉంటాను కానీ ట్రిగ్గర్ అయితే మాత్రం ..” అని సోనియా ఇచ్చిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×