BigTV English

12 crore CAR : రూ.12 కోట్ల కారు కొన్న హైదరాబాదీ

12 crore CAR : రూ.12 కోట్ల కారు కొన్న హైదరాబాదీ

12 crore CAR : కారు అంటే ఎవరికి మోజు ఉండదు చెప్పండి. బడాబాబుల నుంచి సామాన్యుల దాకా… ఓ కారు ఉంటే ఆ దర్జాయే వేరు అని అంతా అనుకుంటూ ఉంటారు. తమ బడ్జెట్ కు తగ్గట్లు కార్లు కొంటూ ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త ఒకరు… దేశంలోనే అత్యంత ఖరీదైన కారుకొని వార్తల్లో నిలిచాడు.


హైదరాబాదీ అయిన బిజినెస్ మెన్ నసీర్‌ఖాన్‌… ఏకంగా రూ.12 కోట్లు పెట్టి ‘మెక్‌లారెన్‌ 765 LT’ కారు కొన్నాడు. దానితో తాను తీసుకున్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెట్టాడు. క్షణాల్లో వైరల్ అయిన ఆ వీడియోలు, ఫోటోలు చూసిన వాళ్లు… రేటు వినగానే, వామ్మో.. అంతా! అంటున్నారు. నసీర్‌ఖాన్‌ దగ్గర ఇప్పటికే ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. ఫెరారీ, లంబోర్గిని, రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్ వంటి ఖరీదైన కార్లను గతంలోనే సొంతం చేసుకున్నాడు… నసీర్‌ఖాన్‌.

మెక్‌లారెన్‌ కంపెనీ కొన్నాళ్ల కిందట దేశంలోనే తన తొలి షోరూమ్‌ను ముంబైలో ప్రారంభించింది. ‘765LT’ బ్రాండ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రెండు రోజుల కిందటే ఆ కారును కొన్నాడు… నసీర్‌ఖాన్‌. మెక్‌లారెన్‌ కంపెనీ దేశంలో విక్రయించిన రెండు ‘765LT’కార్లలో… ఒకటి కోల్‌కతా వ్యాపారి కొనుగోలు చేయగా… రెండో కారును నసీర్‌ఖాన్‌ సొంతం చేసుకున్నాడు.


‘765LT’కారు ఎక్స్ షోరూమ్‌ ధరే రూ.12 కోట్లు అని చెబుతున్నారు. దీని రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ కలుపుకుంటే దీని ధర రూ.15 కోట్ల దాకా ఉండే అవకాశం ఉంది.

‘765LT’ కారును 4.0 లీటర్ ట్విన్-టర్బోచార్జుడ్ V8 పెట్రోల్ ఇంజిన్‌తో తయారు చేసింది… మెక్‌లారెన్‌. ఈ కన్వర్టిబుల్ కారు పైకప్పు కేవలం 11 సెకన్లలోనే తెరుచుకోవడం విశేషం. మెక్‌లారెన్ ఇప్పటిదాకా తయారు చేసిన అత్యంత వేగవంతమైన కన్వర్టిబుల్‌ కార్లలో ఇదీ ఒకటి.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×