BigTV English

Apple products : యూజర్ల ప్రాణాలు కాపాడుతున్న ఆపిల్ ప్రొడక్ట్స్

Apple products : యూజర్ల ప్రాణాలు కాపాడుతున్న ఆపిల్ ప్రొడక్ట్స్

Apple products : ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆపిల్ వాచ్, ఐఫోన్లకు యూజర్ల నుంచి భారీ డిమాండ్ ఉంటుంది. వాటిలో ప్రాణాలు కాపాడే ఫీచర్లు కూడా జతయ్యాక… ఎందరో వినియోగదారులు అనారోగ్యం, ప్రమాదాల నుంచి బయటపడ్డ ఘటనలు కోకొల్లలు. అప్పటి నుంచి ఆపిల్ వాచ్, ఐఫోన్లకు డిమాండ్ మరింత పెరిగింది.


ఇప్పుడు మరో యూజర్… ఐఫోన్ సాయంతో తన భార్య ప్రాణాలు కాపాడుకోగలిగాడు. ఐఫోన్ 14లోని క్రాష్ డిటెక్టర్ ఫీచర్ సాయంతో… అంబులెన్స్ కంటే ముందే ప్రమాదానికి గురైన భార్య దగ్గరికి వెళ్లి… ఆమెను ఆస్పత్రికి తరలించాడు. సకాలంలో ఆమెను ఆస్పత్రికి చేర్చడంతో… ప్రాణాలు కాపాడగలిగామని డాక్టర్లు చెప్పారు.

ఆఫీస్‌ పని మీద ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఓ వ్యక్తి… ఫోన్లో భార్యతో మాట్లాడుతూ వెళ్తున్నాడు. ఉన్నట్టుండి భార్య గట్టిగా కేకలు వేయడం అతనికి ఫోన్లో వినిపించింది. ఆ తర్వాత కొన్ని సెకన్లకే ఆమె ఫోన్ కాల్ కట్ అయిపోయింది. మళ్లీ ఫోన్ చేసినా కనెక్ట్ కాలేదు. దాంతో ఏం జరిగిందోనని కంగారుపడుతూ బయలుదేరుతుండగా… అతని ఫోన్‌కు ఓ మెస్సేజ్ వచ్చింది. అతని భార్యకు యాక్సిడెంట్‌ అయిందని, ఫలాన చోట ప్రమాదం జరిగిందని అడ్రస్‌తో సహా అందులో ఉంది. దాంతో అతను ఘటనా స్థలానికి అంబులెన్స్ కంటే ముందే చేరుకున్నాడు. క్షణాల్లో ఆమెను ఆస్పత్రిలోని అత్యవసర విభాగానికి తరలించి, చికిత్స అందేలా చూశాడు. దాంతో, డాక్టర్లు ఆమె ప్రాణాలు కాపాడగలిగారు. తన అనుభవాన్ని అతను సోషల్ మీడియాలో పంచుకోవడంతో… నెటిజన్లు అద్భుతమంటూ ప్రసంశలు కురిపిస్తున్నాడు.


ఇదొక్కటే కాదు… గతంలోనూ ఆపిల్ వాచ్, ఐఫోన్లు ఎందరో యూజర్లను కాపాడాయి. హార్ట్ బీట్, ఈసీజీ ద్వారా అనారోగ్య సమస్యలపై ఆపిల్ వాచ్ హెచ్చరించడంతో… కొందరు యూజర్లు ఆస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకుని… తగిన చికిత్సతో ప్రాణాలు కాపాడుకున్నారు. మరికొందరు యూజర్లు అనుకోని ప్రమాదాల్లో చిక్కుకుని, సాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో… ఐఫోన్ల నుంచి కుటుంబసభ్యులు, స్నేహితులకు సందేశాలు వెళ్లడంతో… వాళ్లు సకాలంలో స్పందించి తమవారిని రక్షించుకున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×