BigTV English

Hydra: బ్రేకింగ్ న్యూస్.. సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పందించిన హైడ్రా కమిషనర్.. ఇక కూల్చివేతలు ఆగనున్నాయా?

Hydra: బ్రేకింగ్ న్యూస్.. సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పందించిన హైడ్రా కమిషనర్.. ఇక కూల్చివేతలు ఆగనున్నాయా?

Hydra Commissioner AV Ranganath Reacted to the Supreme Court Verdict: బుల్డోజర్ కూల్చివేతలపై తాజాగా సుప్రీంకోర్టు  ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. ఆ ఆదేశాలు హైడ్రాకు వర్తించవంటూ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కేవలం ఉత్తర ప్రదేశ్ లోని నేరస్థులు, నిందితుల ఇళ్లు, ఆస్తుల కూల్చివేతలకు సంబంధించి మాత్రమే వర్తిస్తాయని చెప్పారు. రైల్వే ఆస్తులు, నీటి వనరుల ఆక్రమణలు, బహిరంగ స్థలాల ఆక్రమణల తొలగింపు విషయంలో తమ ఆదేశాలు వర్తించవంటూ సుప్రీంకోర్టు పేర్కొన్నదంటూ ఆయన గుర్తుచేశారు.


Also Read: రాజీవ్ గాంధీ విగ్రహంపై బీఆర్ఎస్ రాద్ధాంతం ఎందుకు? కేటీఆర్ అంత మాటెందుకు అన్నాడు?

ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేతల పరంపర కొనసాగుతుందని చెప్పారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి కట్టిన కట్టడాలను మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందని ఆయన అన్నారు. అయితే, యూపీ మాదిరిగా ఇక్కడ కూల్చివేతలు చేపడుతలేమన్నారు. నేరస్థులు, నిందితుల ఆస్తుల జోలికి వెళ్లడంలేదన్నారు.


ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో హైడ్రా దూసుకెళ్తుంది. ఎక్కడా చెరువులు కబ్జాకు గురయ్యాయని తెలిసినా వెంటనే అక్కడికి కూల్చివేతలు చెపడుతుంది. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతలపై ఇటీవల పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ముందస్తుగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా కూల్చివేతల పరంపర కొనసాగిస్తున్నదంటూ, ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ పలువురు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే తాజాగా సుప్రీంకోర్టు బుల్డోజర్ కూల్చివేతలకు సంబంధించి ఆదేశాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. హైడ్రాకు ఆ ఆదేశాలు వర్తించవని, కూల్చివేతలు కొనసాగుతాయని చెప్పారు.

Also Read: ఖైరతాబాద్ బడా గణేషుడి నిమజ్జనం పూర్తి.. ఊపిరి పీల్చుకున్న అధికారులు

Related News

Komatireddy Rajagopalreddy: హమ్మయ్య..! రాజగోపాల్ రెడ్డి ఇగో చల్లారినట్టేనా?

Weather News: కుండపోత వర్షం.. సాయంత్రం నుంచి ఈ జిల్లాల్లో దంచుడే.. ఇంట్లోనే ఉంటే బెటర్

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Big Stories

×