మాల్దీవుల 60వ స్వాతంత్ర దినోత్సవంలో పాల్గనేందుకు ఆ దేశం వెళ్లిన భారత ప్రధాని మోదీ.. స్వేచ్ఛా వాణిజ్యంపై కీలక చర్చలు జరిపారు. అంతే కాదు, మాల్దీవుకు భారత్ నుంచి రూ.4,850 కోట్ల రుణం మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఏడాది క్రితం ఉప్పు నిప్పుగా ఉన్న ఇరు దేశాలు ఇప్పుడు కలసి పోవడం ఇక్కడ విశేషం. బాయ్ కాట్ మాల్దీవ్స్ అంటూ భారతీయులు సోషల్ మీడియాలో చేసిన రచ్చ గతంలోనే చల్లారింది. తాజాగా మోదీ ఆదేశానికి భారీ అప్పు ప్రకటించారు. మాల్దీవులతో ప్రస్తుతం భారత్ సామరస్యపూరక స్నేహాన్ని కొనసాగిస్తోంది.
అప్పట్లో ఏం జరిగింది..?
లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ, భారతీయ టూరిస్ట్ లు ఇకపై ఈ ప్రాంతాన్ని కూడా తమ లిస్ట్ లో చేర్చుకోవాలని సూచించారు. మోదీ వ్యాఖ్యల తర్వాత మాల్దీవ్స్ కి చెందిన కొందరు రాజకీయ నాయకులు అవసరం లేకపోయినా అతిగా స్పందించారు. లక్షద్వీప్ కి అంత సీన్ లేదని, అసలు భారత్ ఆవు పేడతో చేసిన లడ్డూలా ఉంటుందని తీవ్రంగా విమర్శించారు. ఆ తర్వాత బాయ్ కాట్ మాల్దీవ్స్ అనే ట్రెండ్ మొదలైంది. ఆ తర్వాత ఆ దేశ మంత్రులు భారత్ కి రావడం, తప్పైపోయిందని ఒప్పుకోవడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. తాజాగా భారత ప్రధాని మోదీ.. మాల్దీవ్స్ కి వెళ్లడం, ఆ దేశానికి భారీ రుణం మంజూరు చేయడంతో ఇరుదేశాల మధ్య పాత స్నేహం పునరుర్ధరించినట్టయింది.
భారీ రుణం..
భారత్‌కు మాల్దీవులు అత్యంత విశ్వసనీయ పొరుగు దేశమని అన్నారు ప్రధాని మోదీ. పొరుగుదేశాలకే తొలి ప్రాధాన్యం అనే భారత నినాదాన్ని ఆయన మరోసారి వినిపించారు. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుతో భేటీలో పాల్గొన్న మోదీ మౌలిక వసతులు, వాణిజ్య, రక్షణ రంగాల్లో పరస్పర సహకారానికి సిద్ధమని చెప్పారు. రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకోడానికి మాల్దీవులకు భారత్ ఎప్పుడూ మద్దతిస్తుందని స్పష్టం చేశారాయన. గతేడాది భారత్, మాల్దీవులకు 400 కోట్లు కేటాయించగా ఈ ఏడాది 600 కోట్లు గ్రాంట్ గా ఇస్తామని హామీ ఇచ్చింది.
#WATCH | Malé: At the official banquet being hosted in his honour by Maldivian President Mohamed Muizzu, PM Modi says, "Last year, the President visited India on a State Visit. Now, I have received the opportunity to be the first State Guest in his tenure."
(Video: ANI/DD) pic.twitter.com/wjyrc1praY
— ANI (@ANI) July 25, 2025
ఘన స్వాగతం..
మాల్దీవుల 60వ స్వాతంత్రదినోత్సవంలో పాల్గొనేందుకు రెండు రోజుల పర్యటనకోసం ప్రధాని మోదీ మాలేకు వెళ్లారు. ఈ కార్యక్రమానికి ఆయనే చీఫ్ గెస్ట్. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు సహా కీలక మంత్రులు వెలెనా ఎయిర్‌పోర్టులో మోదీకి ఘన స్వాగతం పలికారు. సైనికులు మోదీకి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల బలోపేతం కోసం ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. భారత్, మాల్దీవుల మధ్య సహకారం, కనెక్టివిటీ మరింత పెరగాలన్నారు ఆ దేశ అధ్యక్షుడు మయిజ్జు. నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించడంపై కూడా భారత ప్రధాని మోదీతో చర్చించానని చెప్పారు. మాల్దీవుల జాతీయ రక్షణ దళానికి 72 వాహనాలను అందించినందుకు భారతదేశానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్య రంగంలో మాల్దీవుల ప్రధాన భాగస్వామిగా భారత్ ఉందన్నారు. మాల్దీవుల పర్యాటక రంగానికి కీలకమైన మార్కెట్ భారత్ అని చెప్పారు.
PM Modi signs guestbook, escorted to Maldives President's office with MNDF band
Read @ANI Story |https://t.co/t3EAzfdGFJ#PMModi #Maldives #Bilateral pic.twitter.com/VuM1keCLtT
— ANI Digital (@ani_digital) July 25, 2025