E-Paper
Advertisement

40 ఏళ్లుగా పన్నులు చెల్లిస్తున్నా వదల్లేదు.. రామంతాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు!

40 ఏళ్లుగా పన్నులు చెల్లిస్తున్నా వదల్లేదు.. రామంతాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు!
Advertisement

HYDRAA Demolition: హైదరాబాద్‌లోని రామంతాపూర్ పెద్ద చెరువు ఆక్రమణలపై హైడ్రా (HYDRAA) అధికారులు మరోసారి విరుచుకుపడ్డారు. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన ఒక భారీ షెడ్‌ను బుల్డోజర్లతో కూల్చివేశారు. శనివారం ఉదయాన్నే భారీ బందోబస్తు మధ్య రంగంలోకి దిగిన అధికారులు, క్షణాల వ్యవధిలోనే నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. అయితే ఈ చర్య స్థానికంగా తీవ్ర దుమారానికి దారితీసింది.

మా ఆవేదన ఎవరికి చెప్పుకోవాలి?

Advertisement

అధికారుల తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 40 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నామని యజమానులు ఆవేదన చెందారు. అన్ని అనుమతులు ఉన్న భూమిపై ఇన్నేళ్ల తర్వాత ఉన్నపళంగా దాడి చేసి కూల్చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇది తమ పొట్టకొట్టడమేనని, దశాబ్దాల కష్టాన్ని ఒక్క నిమిషంలో బూడిద చేశారని వాపోయారు.

కోర్టులో ఉండగానే కూల్చివేతలా?

Advertisement

గత మూడు రోజులుగా అధికారులు సర్వే పేరుతో తమ ప్రాంతానికి వస్తుండటంతో అనుమానం వచ్చి హైకోర్టును ఆశ్రయించామని యజమానులు తెలిపారు. అసలు చెరువు ఎఫ్‌టీఎల్ హద్దులను ఇప్పటివరకు స్పష్టంగా నిర్ధారించలేదని, ముందుగా ఆ హద్దులు నిర్ణయించిన తర్వాతే ఎలాంటి చర్యలైనా తీసుకోవాలని తాము కోరినట్లు చెప్పారు. కోర్టు పరిధిలో విషయం నడుస్తుండగానే.. తమ మాట వినకుండా అధికారులు తొందరపాటుతో వ్యవహరించారని ఆరోపించారు.

నిబంధనలు పాటించాలంటున్న బాధితులు

చట్టబద్ధంగా భూమి కొనుగోలు చేసి, ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న తమలాంటి వారి విషయంలో ప్రభుత్వం సరైన ప్రక్రియను అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తగిన సమయం ఇవ్వకుండా, నోటీసులు లేకుండా ఇలా హఠాత్తుగా కట్టడాలను కూల్చివేయడం అన్యాయమని, న్యాయం జరిగే వరకు తాము పోరాడుతామని యజమానులు స్పష్టం చేశారు.

Also Read: నల్గొండలో దారుణం.. తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కుమారుడు

Tags

Related News

సీఎం రేవంత్ రెడ్డికి.. బండి సంజయ్ సవాల్!

నల్గొండలో దారుణం.. తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కుమారుడు

మిమ్మల్ని బొక్కలో వేసి తన్నే రోజులు త్వరలోనే వస్తాయి.. అద్దంకి దయాకర్ వార్నింగ్!

రావల్‌కోల్‌లో వీధి కుక్కల బీభత్సం.. 10 గొర్రెలు మృతి, రూ. 2 లక్షల నష్టం!

తెలంగాణలో సీనియర్ రెసిడెంట్ పోస్టింగ్‌ల రగడ.. రికమెండేషన్ దందాలకు చెక్!

ర్యాపిడోలో బంగారం పార్సిల్.. చేతివాటం చూపించిన డెలివరీ బాయ్!

సీజ్ చేసిన ఫోన్‌తో రూ.1.70 లక్షలు బదిలీ.. 12 తులాల బంగారం తాకట్టు పెట్టిన కానిస్టేబుల్ అరెస్ట్

Big Stories

Advertisement
×