BigTV English

Hydra effect: హైడ్రా దూకుడు.. వణుకుతున్న సెలబ్రిటీలు.. రేపోమాపో కన్వెన్షన్ సెంటర్లపై..

Hydra effect: హైడ్రా దూకుడు.. వణుకుతున్న సెలబ్రిటీలు.. రేపోమాపో కన్వెన్షన్ సెంటర్లపై..

Hydra on illegal constructions(Hyderabad latest news): రేవంత్‌రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థ.. చాలామంది నేతలు, నటులు, రియల్టర్లకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. హైడ్రా అధికారులు ఎప్పుడు తమ అపార్టుమెంట్లను కూల్చుతారోనన్న భయంతో బెంబేలెత్తుతున్నారు.


రాజకీయ, సినీ, అధికారుల, సామాన్యులు సైతం ఉన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న చెరువులను కబ్జా చేసి పెద్ద పెద్ద భవనాలను కట్టేశారు. ఆక్రమణకు గురైన చెరువులను రక్షించకపోతే వర్షాలు వచ్చినప్పుడు ఫ్లడ్‌ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారింది. చెరువుల చుట్టూ కబ్జాకు గురైన వాటిపై హైడ్రా దృష్టి సారించింది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు 20 చెరువుల ఆక్రమణలను తొలగించారు అధికారులు. దాదాపు 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అధికారులపై రాజకీయ పరమైన ఒత్తిళ్లు లేకపోలేదు. అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపైనా కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది హైడ్రా.


ALSO READ:  గ్రూప్ -1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మెయిన్స్ పరీక్షా సమయాల్లో మార్పు

గడిచిన పదేళ్లలో హైదరాబాద్ సిటీ పరిధిలో వేలాది ఎకరాలు యథేచ్ఛగా కబ్జాలకు గురయ్యాయి. వార్డు కార్పొరేటర్ మొదలు బడా రాజకీయ నాయకుల వరకు ఉన్నారన్నది అసలు నిజం. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు వ్యక్తులున్నట్లు వార్తలు లేకపోలేదు. మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి కన్వెన్షన్ హాల్‌ను కట్టించారనే ఆరోపణలు ఉన్నాయి.

గతంలో కేసీఆర్ సర్కార్ వాటిని కూల్చేందుకు బుల్ డోజర్లను పంపినప్పటికీ, ఆ తర్వాత జరిగిన పరిణా మాల కారణంగా వెనక్కివెళ్లిపోయింది. దీనిపై హైడ్రా దృష్టి సారించినట్టు సమాచారం. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, గ్రేటర్ హైదరాబాద్‌లో చెరువుల కబ్జాలపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి నివేదిక తెప్పించుకున్నారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా దాదాపు 56 చెరువులు కబ్జా అయినట్టు తేలింది.

ఒక్కసారి వెనక్కి వెళ్తే.. ఈ ఏడాది సమ్మర్‌లో మంచినీరు దొరక్క బెంగుళూరు వాసులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీకావు. అక్కడి చెరువులను కబ్జా చేసి భవనాలు కట్టేశారు. ఫలితంగా బెంగుళూరు వాసులు గుప్పెడు నీటి కోసం కష్టాలు పడ్డారు. ముంబై సిటీ శివార్లలో భారీగా చెరువులు ఉన్నాయి. వర్షాలు పడినా నీరంతా వాటిలోకి వెళ్లిపోతుంది. తాగునీటికి అక్కడ ఇబ్బంది రాలేదన్నది అక్కడి ప్రజల మాట. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ అటు వైపు దృష్టిసారించింది. హైడ్రా వ్యవస్థను తీసుకురావడంతో కబ్జా రాయుళ్లు వణుకుతున్నారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×