Hydra Marshals: హైడ్రాకు మార్షల్స్ షాకిచ్చారు. హైదరాబాద్ సిటీలో అత్యవసర సేవల విధులను బహిష్కరించారు. దీంతో నగర వ్యాప్తంగా ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోయాయి. జీతాల తగ్గింపుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దీనికి కారణమని భావిస్తున్నారు. అసలేం జరిగింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
హైదరాబాద్‌లో హైడ్రా మార్షల్స్ ఆందోళనకు దిగారు. జీతాల్లో కోత విధించారని నిరసనకు దిగారు మాజీ సైనికులు. దీంతో విధులు బహిష్కరించారు హైడ్రా మార్షల్స్. దీంతో హైడ్రా సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. హైడ్రా మార్షల్స్ గురించి చెప్పనక్కర్లేదు. సిటీలో విపత్తు నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ కోసం మాజీ సైనిక ఉద్యోగులు పని చేస్తున్నారు.
అయితే ఈసారి వీరికి ఇచ్చే వేతనాలు తగ్గించడంతో ఆగ్రహించారు. ఆందోళనకు దిగారు. దీనిపై హైడ్రా నుంచి ఎలాంటి ప్రకటన రావడంతో విధులను బహిష్కరించారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షాల సమయంలో ఎమర్జెన్సీ సేవలు స్తంభించాయి.
నగరంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను కాపాడటంతోపాటు వర్షాల సమయంలో తలెత్తే సమస్యలను తగ్గించేందుకు పగలు, రాత్రిళ్లు శ్రమిస్తున్నారు. జీతంలో ఏడు వేల కోత విధించినట్టు చెబుతున్నారు. అయితే ఎందుకు కట్ చేశారన్నది తమకు తెలీదని అంటున్నారు.
ALSO READ: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్, హామీలు నెరవేర్చకుంటే రాజీనామాలే
ఈ విషయమై కమిషనర్ ఏవీ రంగనాథ్‌తో మాట్లాడుతామని అంటున్నారు మార్షల్స్. డీజీఆర్ స్కేలు ప్రకారం.. ప్రతీ వ్యక్తికి 34 వేలు రూపాయలు ఉంటుందన్నారు. జీవో పాస్ అయ్యిందని, మీ సాలరీ తగ్గుతోందని చెప్పారని వివరించారు. దేనికి తగ్గింది అన్నదానిపై ఎలాంటి సమాచారం లేదన్నారు.
రాత్రి పగలు పని చేస్తున్నామని జీతం పెంచాల్సింది పోయి సడన్‌గా కట్ కావడంతో 150 డివిజన్లలో హైడ్రా సేవలు బంద్ అయ్యాయి. కంట్రోల్ రూమ్‌లో 24 గంటలు తాము సర్వీసులు అందిస్తున్నామని అంటున్నారు. కనీసం వీక్లీ ఆఫ్ కూడా లేదని అంటున్నారు. గతంలో 30శాతం జీతం పెంచుతామని కమిషనర్ రంగనాథ్ చెప్పారని అంటున్నారు.
పెంచడం పక్కన పెట్టి ఉన్న జీతాన్ని తగ్గించారని అంటున్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు రెండు రోజులు, మూడు రోజులు కంటిన్యూగా పని చేస్తున్నామని చెబుతున్నారు. గతంలో జీహెచ్ఎంసీ ఈవీడిఏంలో పని చేసినప్పుడు 8 గంటల డ్యూటీ మాత్రమే ఉండేదన్నారు. ఇప్పుడు 12 గంటలు పైగానే పని చేయిస్తున్నారని అంటున్నారు.
కొందరు అధికారులు రెస్పెక్ట్ ఇవ్వలేదని, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు. ఆర్మీ నుండి రిటైర్ కావడంతో పెన్షన్ వస్తుందన్నారు. కాని కొందరు మా పెన్షన్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి చేసిన సేవను గుర్తించి పెన్షన్ ఇస్తున్నారని గుర్తు చేశారు. కూలీ పని చేసుకునే వాళ్లకు జీతం పెరుగుతుందని, మాకు తగ్గించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
హైడ్రా మార్షల్స్ ఆందోళన
విధులు బహిష్కరించిన హైడ్రా మార్షల్స్
జీతాల్లో కోత విధించారని నిరసనకు దిగిన మాజీ ఆర్మీ సైనికులు
హైడ్రా కూల్చివేతలు చేసే ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహిస్తున్న మార్షల్స్
రూ.29 వేలు ఉన్న జీతంలో రూ.7వేలు తగ్గించారని ఆందోళనలు
విధుల బహిష్కరణతో మాన్సూన్… pic.twitter.com/xmXBMay2dt
— BIG TV Breaking News (@bigtvtelugu) August 11, 2025