BigTV English

Hydra : కన్నీరు పెట్టుకున్న పూజారి.. కదిలి వచ్చిన అధికార యంత్రాంగం.. ఏమైందంటే..

Hydra : కన్నీరు పెట్టుకున్న పూజారి.. కదిలి వచ్చిన అధికార యంత్రాంగం.. ఏమైందంటే..

Hydra : స్వామి వారికి నిత్యం ధూపదీపా నైవేద్యాలు పెట్టే పూజారి.. నిత్యం స్వామి శరణలో తరించే భక్తి పరుడు. మొదటిసారి చేతులు జోడించి సాయం అర్థించారు. అందరినీ కాపాడాలని ఆ దేవున్ని కోరుకునే బ్రాహ్మణుడు.. తొలిసారి ఆ దేవుడినే కాపాడాలని వేడుకున్నాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ స్వామి వారి భూముల్ని మింగేస్తున్న కబ్జాకోరులు.. త్వరలోనే స్వామి వారి ఆలయాన్ని ఆక్రమిస్తారంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.  ఈ పూజారి వీడియో గత కొన్ని రోజులుగా వైరల్ గా మారింది. అనేక మంది ప్రాంతాలతో సంబంధం లేకుండా స్పందించారు. వారిలో.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కూడా ఉన్నారు. స్వయంగా హైడ్రా కమిషనరే సంఘటనా స్థలానికి వెళ్లి ఆక్రమణలను పరిశీలించారు.


కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరి గుట్టపై వున్న గోవిందరాజుల ఆలయం ఉంది. ఈ దేవాలయానికి కొన్ని విలువైన భూములు సైతం ఉన్నాయి. కానీ.. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం, ఆలయ భూముల పరిరక్షణకు సరైన విధానం లేకపోవడంతో.. ఈ కోట్ల విలువైన భూములు అక్రమార్కుల చేతుల్లో పడ్డాయి. ఈ కబ్జా అనకొండలు.. క్రమంగా ఆలయానికి ఆదాయం లేకుండా, ధూపదీప నైవేద్యాలకు సైతం ఇబ్బంది కలిగే రీతిలో చెలరేగిపోతుండడంతో.. ఆలయ పూజారి ఆవేదనతో ఓ వీడియో చేశారు. అందులో.. ఆలయానికి, ఆలయ భూములకు జరుగుతున్న అన్యాయాలను వెల్లడించారు. దాంతో.. విషయం బయటకు వచ్చింది.

ఆలయ భూముల ఆక్రమణలపై ఫిర్యాదులు రావడంతో.. శనివారం నాడు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గోవిందరాజుల స్వామి ఆలయం కొలను, గుండం కబ్జా అవుతున్నట్టు పూజారి నరహరి వీడియోను కూడా చూసి తాను వచ్చినట్లు తెలిపారు. జగద్గిరి గుట్ట ఆలయ సముదాయాలను, ఆలయ భూములను పరిశీలించారు. దాదాపు 3 గంటల సేపు అక్కడే గడిపిన కమిషనర్.. స్థానికుల నుంచి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు.


కమిషనర్ రావడంతో.. స్థానికులు అక్కడే వున్న పర్కి చెరువు కబ్జాలకు కూడా చూపించారు. కుల సంఘాల పేరిట ఆలయాల భూముల కబ్జాలకు చేసి సొంతాని వాడుకుంటున్నట్లు గుర్తించారు. ఇలా కబ్జా చేసిన భూముల్ని ప్లాట్లుగా చేసి అమ్ముకోవడాన్ని సీరియస్ గా తీసుకున్నారు. కబ్జాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని వెల్లడించిన హైడ్రా కమిషనర్.. కబ్జాదారులకు నోటీసులు అందిస్తామన్నారు. సాంకేతికత సాయంతో కబ్జాలపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించారు .

మరో 15 రోజుల్లోనే హైడ్రా పోలీసు స్టేషన్ ప్రారంభిస్తామని తెలిపారు. కబ్జాదారులపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని హెచ్చరించిన కమిషనర్.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక అధికారులపై ప్రభుత్వానికి నివేదిస్తామని ప్రకటించారు. వచ్చే బుధవారం జగద్గిరి గుట్ట ఆలయ భూములతో పాటు పర్కి చెరువు కబ్జాలపై స్థానికులతో హైడ్రా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కబ్జా ఆరోపణలున్న భూములకు సంబంధించి అన్ని ఆధారాలతో హైడ్రా కార్యాలయానికి రావాలని సూచించారు.

వాట్సప్ గ్రూప్ ల్లో నన్నూ చేర్చండి..

పర్కి చెరువు పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి.. చెరువు కబ్జాకాకుండా కాపాడాలని స్థానికుల్ని కోరిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. అధికారులకు ప్రజలు సహకరించాలని సూచించారు. స్థానికులు ఒక కమిటీగా ఏర్పడి దేవాలయ భూముల పరిరక్షణకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. స్థానికులతో కమిటీలు ఏర్పాటు చేసి వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని సూచించిన హైడ్రా కమిషనర్.. ఆయా గ్రూపుల్లో తననూ యాడ్ చేసి సమాచారాన్ని షేర్ చేయాలని సూచించారు.

Also Read :  భూమి లేని పేదలకు ఆర్థిక సాయం.. ఎంపిక ఎలా అంటే..

స్థానిక పూజారి వీడియోతో స్పందించిన హైడ్రా కమిషనర్.. ఆలయ భూముల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ సందర్భంగా.. స్థానిక వేంకటేశ్వర ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వదించారు. హైడ్రా రాకతో కబ్జాల ఆగుతున్నాయని.. త్వరలోనే మా దేవుడు భూములకు కూడా కబ్జాల విముక్తి కలుగుతాయి అంటూ స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×