E-Paper
Advertisement

ఇల్లు లేదా కొత్త ప్లాట్ కొంటున్నారా.. అయితే హైడ్రా మీకు గుడ్ న్యూస్!

ఇల్లు లేదా కొత్త ప్లాట్ కొంటున్నారా.. అయితే హైడ్రా మీకు గుడ్ న్యూస్!
Advertisement

HYDRAA: సర్కారు ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తున్న హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ) అందిస్తున్న సేవ‌ల వివ‌రాల‌తో పాటు కార్య‌క‌లాపాల‌ను వెబ్‌సైట్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు శుక్రవారం నుంచి ప్రజలకు హైడ్రా అందుబాటులోకి తెచ్చింది. hydraa.telangana.gov.in పేరిట రూపొందించిన పోర్ట‌ల్‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ శుక్ర‌వారం ప్రారంభించారు. హైడ్రాకు సంబంధించిన వివిధ సేవలు, సమాచారం, అత్యవసర సహాయం, వాతావరణ వివరాలు, భూములు, చెరువులు, అధికార పరిధి తదితర అంశాలను తెలుసుకోవచ్చు. చెరువుల హ‌ద్దులు, కాలువ‌ల లెక్క‌లు, ప్ర‌భుత్వ భూముల వివ‌రాలు, విపత్తు నిర్వహణ సమాచారంతో పాటు హైడ్రా కార్య‌క‌లాపాల‌న్నీ ఈ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవ‌చ్చనని ఈ సందర్భంగా కమిషనర్ రంగనాధ్ వెల్లడించారు.

అత్యవసర సహాయం కోసం డయల్ 1070..

హైడ్రా 24 గంటల అత్యవసర సహాయం కోసం ప్రజలు హెల్ప్‌లైన్‌ 1070 వివరాలను పోర్టల్‌లో ప్రముఖంగా పొందుపరిచారు. చెట్లు కూలిపోవడం, అగ్ని ప్రమాదాలు, రహదారులపై నీరు నిలవడం, వరదలు, సహాయక చర్యలు, ఇతర విపత్తు సంబంధిత అత్యవసర పరిస్థితులపై పౌరులు పైన సూచించిన ఫోన్ నెంబర్ కు సమాచారం ఇవ్వవచ్చునని అధికారులు తెలిపారు. దీంతో పాటు హైడ్రా పోర్టల్‌ ద్వారానే ఫైర్‌ సేఫ్టీ ఎన్‌వోసీల‌కు దరఖాస్తు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉందని వెల్లడించారు. భవన యజమానులు, నిర్మాణదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు తమ దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చునని, సంబంధిత అధికారులు శాఖ డ్యాష్‌ బోర్డు ద్వారా దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకునే వీలు కల్గిందన్నారు.

ముందే తెలియనున్న నీరు నిలిచే ప్రాంతాలు

Advertisement

భారీ వర్షాలు, వరదల సమయంలో నీరు నిలిచే అవకాశం ఉన్న కీలక ప్రాంతాల వివరాలను అందుబాటులో ఉంచారు. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కమిషనరేట్ల పరిధిలోని వాటర్‌లాగింగ్‌, వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన మ్యాప్‌లను వేర్వేరుగా చూసేలా సౌక్యర్యం కల్పించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. దీంతో భారీ వర్షాల సమయంలో అధికారులు పర్యవేక్షించే ముఖ్య ప్రాంతాలను పౌరులు ముందుగానే తెలుసుకునే అవకాశం ఉండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాల్లో సమస్య కొంత మేరకు తగ్గే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.
టుంది.

Also read: వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే..అపనిందలు వస్తాయా? అసలు రహస్యం ఇదే!

వర్షపాత వివరాలు, వాతావరణ సమాచారం

Advertisement

పోర్టల్‌ ద్వారా లైవ్‌ రెయిన్ ఫాల్‌ మ్యాప్స్‌, రోజువారీ వర్షపాతం వివరాలు, వాతావరణ అంచనాలు, హైదరాబాద్‌ డాప్లర్‌ రాడార్‌ సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో, భారీ వర్షాల సమయంలో ప్రజలు తాజా వాతావరణ పరిస్థితులను తెలుసుకునేలా సమాచారాన్ని అందుబాటులో ఉంచనున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు.

ఎఫ్‌టీఎల్‌, చెరువులు, బఫర్‌ జోన్ల వివరాలు

హైడ్రా వెబ్‌సైట్‌ నుంచి హెచ్ఎండీఏ లేక్స్ పోర్టల్ ను నేరుగా సందర్శించి చెరువులకు సంబంధించిన ఫుట్ ట్యాంక్ లెవెల్ వివరాలను తెలుసుకోవచ్చనని హైడ్రా అధికారులు పేర్కొన్నారు. చెరువులు, ఇతర జలాశయాల చుట్టూ అమల్లో ఉండే ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ నిబంధనలపై కూడా పోర్టల్‌లో సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. చెరువుల సమీపంలో భవన నిర్మాణం లేదా ఇతర అభివృద్ధి పనులు చేపట్టే ముందు వర్తించే నిబంధనలను తెలుసుకునేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని వివరించారు.

మీ భూమి స్థితి తెలుసుకునేందుకు భూ భారతి..

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన భూ భారతి పోర్టల్‌కు హైడ్రా వెబ్‌సైట్‌లో నేరుగా లింక్‌ అందుబాటులో ఉందని వివరించారు. భూమి కొనుగోలు, ఇతర లావాదేవీలు చేపట్టే ముందు సర్వే నెంబర్‌ లేదా పట్టాదారు వివరాల ఆధారంగా అందుబాటులో ఉన్న భూ రికార్డులను పరిశీలించుకునే అవ‌కాశం కల్పించినట్లు హైడ్రా వెల్లడించింది.

పునరుద్ధరించిన చెరువుల వివరాలు..

చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణకు హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం, తాజా వివరాలు కూడా పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వార్తలు, అప్‌డేట్లు, ఫొటోలు, వీడియోల ద్వారా హైడ్రా చేపడుతున్న క్షేత్రస్థాయి కార్యక్రమాలు, చెరువుల పరిరక్షణ చర్యలు, ఇతర అభివృద్ధి పనులను ప్రజలు తెలుసుకోవచ్చునని తెలిపారు. హైడ్రా అధికారిక ప్రకటనలు, పత్రిక ప్రకటనలు, క్షేత్రస్థాయి కార్యకలాపాలు, సందర్శనలు, ముఖ్యమైన ప్రజా సమాచారం కోసం ప్రత్యేకంగా న్యూస్, ఫ్లాష్ న్యూస్ విభాగాలను కూడా పోర్టల్ లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. దీంతో హైడ్రాకు సంబంధించిన తాజా అధికారిక సమాచారాన్ని ప్రజలు ఒకే చోట తెలుసుకునే పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.

Also read: ముదురుతున్న డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం.. కీలక సమావేశంపై కోర్టు స్టే!

Tags

Related News

మగవాళ్లే చీర కట్టుకుని అలాంటి దందాలు.. అదిలాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ల ఆవేదన!

మేడ్చల్‌ స్వరూప నర్సింగ్ హోమ్‌లో షాకింగ్ సీన్.. కిటికీకి సెలైన్ బాటిల్ కట్టి..?

అవార్డులు ప్రతిభకా.. లేక పరిచయాలకా.. ఉపాధ్యాయ అవార్డుల ఎంపికలో దారుణం!

కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గరపడింది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!

జీహెచ్ఎంసీలో ష్.. గప్ ‌చుప్ రూల్.. ఉన్నతాధికారుల సీక్రెట్ ఆంక్షలు!

1980s ఫోటో ట్రెండ్ వెనుక పెద్ద స్కామ్.. సైబర్ క్రైమ్ పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్!

నాడు ఎన్నికల్లో.. నేడు పరిపాలనలో.. రేవంత్ మైండ్ గేమ్‌లో ఇరుక్కున్న బీఆర్ఎస్!

Big Stories

Advertisement
×