BigTV English

GHMC : గ్రేటర్ హైదరాబాద్ కొత్త కమిషనర్‌గా ఇలంబర్తి, పలువురు ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు

GHMC : గ్రేటర్ హైదరాబాద్ కొత్త కమిషనర్‌గా ఇలంబర్తి, పలువురు ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కొత్త కమిషనర్‌గా ఇలంబర్తి నియామకమయ్యారు. ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. పలువురు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలను అప్పగించింది. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈవోగా ఆర్.వి.కర్ణన్‌, ఆయుష్‌ డైరెక్టర్‌గా క్రిస్టినాకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


ఇక టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్‌.శ్రీధర్‌, విద్యుత్‌ శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్‌ కుమార్‌ సుల్తానియా, మహిళా సంక్షేమ శాఖ కార్యదర్శిగా టి.కె.శ్రీదేవిని నియమించారు.

తెలంగాణ నుంచి ఏపీకి చెందిన నలుగురు అధికారులు ఇప్పటికే రిలీవ్‌ అయ్యారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేసిన ఆమ్రపాలి సైతం ఏపీ ప్రభుత్వంలో రిపోర్ట్ చేశారు. దీంతో కీలకమైన నగర బల్దియా కమిషనర్ స్థానం ఖాళీ కాగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా భర్తీ చేసింది.


ఆయా ఐఏఎస్‌లు వదిలిన స్థానాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంఛార్జీలను నియమించింది. డీఓపీటీ ఆదేశాల మేరకు తెలంగాణ నుంచి వాణిప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి ఏపీకి రిలీవ్ అయ్యారు.

Also Read : గురుకులాలకు బీఆర్ఎస్ తీరని అన్యాయం చేసింది – ఎమ్మెల్సీ కోదండరాం

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×