BigTV English

Indiramma Indlu Scheme: ఈ నెలలోనే ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి పొంగులేటి వెల్లడి

Indiramma Indlu Scheme: ఈ నెలలోనే ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి పొంగులేటి వెల్లడి

Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.ఈ నెలాఖరులోపు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని వెల్లడించారు. న్ని నియోజకవర్గాల్లో కలిపి 4.50 లక్షల ఇందరిమ్మ ఇళ్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టు తెలిపారు. గతంలో వైఎస్ఆర్ హయాంలో ప్రతి గ్రామంలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు దక్కాయని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. ఇప్పుడు తమ ప్రభుత్వం కూడా అర్హులైన అందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లను ఇస్తుందని స్పష్టం చేశారు. తొలి విడతగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వబోతున్నదని వివరించారు.


మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్కలు భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో శనివారం పర్యటించారు. మైలారం గుట్టపై ఇండస్ట్రియల్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం, మంత్రులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి పై ప్రకటన చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు అంటూ అందరినీ మోసం చేసిందని మండిపడ్డారు. ఏ వేదిక ఎక్కినా కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్ల గురించి దంబానికి పోయేవాడని తెలిపారు. తన సొంత నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను పేపర్‌లలో వేయించుకుని ప్రచారం చేసుకున్నారని, రాష్ట్రమంతటా నిర్మిస్తున్నట్టు ప్రజలను మభ్య పెట్టారని ఆరోపించారు.

Also Read: వయనాడ్ కొండ గుహలో చిక్కుకున్న గిరిజనులు.. తర్వాత ఏమైందంటే ?


పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 1.50 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించిందని మంత్రి పొంగులేటి వివరించారు. కానీ, తమ ప్రభుత్వం తొలి విడతలోనే 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించబోతున్నట్టు తెలిపారు. తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దులుగా పేదలకు సేవలు అందిస్తున్నదని వివరించారు. సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఇచ్చిన మాటను కాంగ్రెస్ తప్పదన్నారు. ఎంత కష్టమైనా సరే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 7.20 లక్షల కోట్ల అప్పు చేసినా.. మాట నిలబెట్టుకోవడానికి, రైతుల కళ్లల్లో ఆనందం చూడటానికి తమ ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్నదని వివరించారు. ఇప్పటికే రెండో విడత నిధులు విడుదల చేశామని, లక్షన్నర రూపాయాలలోపు రుణాలను మాఫీ చేసినట్టు పేర్కొన్నారు

Related News

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Big Stories

×