E-Paper
Advertisement

Ponguleti Srinivas Reddy: జనగామ మున్సిపాలిటీలో వెయ్యి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి!

Ponguleti Srinivas Reddy: జనగామ మున్సిపాలిటీలో వెయ్యి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి!
Advertisement

Ponguleti Srinivas Reddy:  జ‌న‌గామ‌, స్వేచ్ఛ‌: తెలంగాణ‌లో రావ‌ణాసూరిడి రాజ్యం పోయింది. ఇందిర‌మ్మ రాజ్యం వ‌చ్చింద‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. శ‌నివారం జ‌న‌గామ మున్సిపాలిటి ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ధ‌ర్మ‌కంచె, అంబేడ్క‌ర్ విగ్ర‌హం, జ‌న‌గామ చౌర‌స్తా, ఎం ఆర్ ఓ కార్యాల‌యాల వ‌ద్ద కార్న‌ర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. డీసీసీ అధ్య‌క్షురాలు లాకావ‌త్ ధ‌న్వంతి నేతృత్వంలో జ‌రిగిన ఈ మీటింగ్‌లో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి మాట్లాడుతూ గ‌త పాల‌కులు డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల పేరుతో పేద‌ల‌ను మోసం చేశార‌ని అన్నారు.

Also Read: Ponguleti Srinivas Reddy: ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి!

మున్సిపాలిటిలో 1000ఇండ్లు

Advertisement

పేదోడి ఇల్లు ఇవ్వ‌లేని దుర్మార్గ పాల‌న‌లో మ‌నం గ‌డిపామ‌ని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 4.5లక్ష‌ల ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాము. ఏప్రీల్ నెల‌లో మ‌రోసారి ఇందిర‌మ్మ ఇండ్లు ఇస్తాము. జ‌నగామ మున్సిపాలిటిలో 1000ఇండ్లు ఇస్తాము. జ‌న‌గామలో ఇండ్ల స్థ‌లాలు కూడా ఇస్తాము. రెవెన్యూ మంత్రిగా ఇక్క‌డ ఉన్న భూ స‌మ‌స్య‌ను 53/1 స‌ర్వే నెంబ‌ర్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామని మాటిచ్చారు. ఇందిర‌మ్మ రాజ్యంలో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం క‌ల్పించాము. స‌న్న‌బియ్యం ఇచ్చాము. ఉచిత క‌రెంట్ ఇచ్చాము. మీ గుండెల్లో ఉన్న కాంగ్రెస్ ను గెలిపించాలి.

మీ స‌మ‌స్య‌లు నేను తీర్చుతా

మీ స‌మ‌స్య‌లు నేను తీర్చుతా. ఇప్ప‌టి ప్ర‌భుత్వం రావ‌ణాసూరిడి ప్ర‌భుత్వంను అంత‌మెందించింది. ఇది ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం. ఏ ప‌ని జ‌రుగాల‌న్నా ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, ప్ర‌తాఫ్‌రెడ్డిలు నాకు చెపుతారు.. మేము చేస్తాము. జ‌న‌గామ లోని మెజారిటీ వార్డుల‌ను గెలిపించిండి, చైర్మ‌న్‌ను కాంగ్రెస్‌కు ఇవ్వండి, మాకు స్వార్ధం ఉంట‌ది ఇక్క‌డ ఉన్న మూడు రంగుల జెండాను ఎగురవేయాలి.. ఓట్లు మాకు వేయండి.. అభివృద్ధి చేస్తాము. జ‌న‌గామ ప‌ట్ట‌ణాన్ని నంద‌న వనంగా తీర్చిదిద్దుతామని హామి ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్‌రెడ్డి, డీసీసీ అధ్య‌క్షురాలు లాకావ‌త్ ధ‌న్వంతి, పీసీసీ మెంబ‌ర్ డాక్ట‌ర్ ల‌క్ష్మీనారాయ‌ణ నాయ‌క్, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జీ కొమ్మూరి ప్ర‌తాప్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Also Read: CM Revanth Reddy: ప్రజాపాలన – ప్రగతి బాట.. తెలంగాణా పునర్నిర్మాణంలో సీఎం రేవంత్ స్పీడ్!

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×