BigTV English

IT Raids : అందుకే ఐటీ దాడులు.. కారణాలు వెల్లడించిన పొంగులేటి.. ఈసీకి ఫిర్యాదు..

IT Raids :  అందుకే ఐటీ దాడులు..  కారణాలు వెల్లడించిన పొంగులేటి.. ఈసీకి ఫిర్యాదు..

IT Raids : తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ నేతలే టార్గెట్‌ గా ఐటీ దాడులు జరుగుతున్నాయి. నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఇంటిలో దాడులు జరుగగా.. నేడు ఖమ్మం మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పొంగులేటి ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. 8 వాహనాల్లో పొంగులేటి ఇంటికి చేరుకున్న ఐటీ అధికారులు.. సిబ్బంది ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


తన ఇల్లు, ఆఫీసులపైనా ఐటీ దాడులు జరగవచ్చని పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారమే ఆరోపించారు. పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేసి 24 గంటలైనా కాకుండానే ఆయన ఇంటిపై ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశమైంది. ఆయన ఆ మాట చెప్పి 24 గంటలు తిరగకుండానే.. ఐటీ దాడులు మొదలయ్యాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచే ఈ తనిఖీలు జరుగుతున్నాయి. కాగా.. కొంతకాలం క్రితమే పొంగులేటి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరగా.. ఈ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తున్నారు.

ఐటీ దాడులపై పొంగులేటి స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్‌ అభ్యర్థులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీలో చేరాలని గతంలో తనపై ఒత్తిడి చేశారని వెల్లడించారు. కాషాయ కండువా కప్పుకోనందుకే ఇప్పుడు ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. కేసీఆర్ కుటుంబాన్ని విమర్శిస్తే ఐటీ దాడులు జరుగుతాయని తన తెలుసని మరోసారి పేర్కొన్నారు. ఉద్దేశపూర్వంగానే నామినేషన్ వేసే రోజు సోదాలు జరుపుతున్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.


.

.

.

మరోవైపు తన ఇంట్లో ఏకకాలంటో ఐటీ సోదాలు చేయడంపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ECకి ఫిర్యాదు చేశారు. నామినేషన్‌ వేస్తున్నానని తెలిసి.. కుట్రపూరితంగా అడ్డుకోవాలనే ఈ దుశ్చర్యానికి పాల్పడ్డారని ఆరోపించారు.

.

.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×