E-Paper
Advertisement

మోదీకి సొంతంగా నిలబడే సీన్ లేదబ్బా …ప్రకాశ్ రాజ్ సెటైర్లు!

మోదీకి సొంతంగా నిలబడే సీన్ లేదబ్బా …ప్రకాశ్ రాజ్ సెటైర్లు!
Advertisement

Prakash Raj:ప్రకాష్ రాజ్ ..కాంట్రవర్సీకి కేరాఫ్ ..అలాంటి ప్రకాష్ రాజ్ గత కొంతకాలంగా బిజేపీ ప్రభుత్వంపై,ఇటు నరేంద్ర మోడీపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్న సంగతి తెల్సిందే.ఇక తాజాగా మరో సారి తనదైన శైలిలో సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చాడు ప్రకాష్ రాజ్.

పవన్ నితీష్ లపై ఆధారపడి 

కలబురగిలో తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్మారక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ మరోసారి మోడీపై సెటైర్లు వేశాడు.అసలు మోడీకి తన కాళ్ళపై తనకి సొంతంగా నిలబడే శక్తే లేదని, కేవలం నితీష్ కుమార్, పవన్ కళ్యాన్ అనే రెండు భుజాలపై ఆధారపడి తన ప్రభుత్వాన్ని వెళ్లదీస్తున్నారని, వాళ్ళు గనుక పక్కకి జరిగితే మోడీ ప్రభుత్వం ఏ క్షణమైనా కుప్పకూలడం తధ్యం అని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.కేవలం బీజేపీ అనే వికసిత్ నినాదం జనాలని బ్రమలలో పెడుతుందని, కానీ వాస్తవానికి దేశం రివర్స్ లో అధోగతి పాలవుతుందని నిప్పులు చెరిగాడు.

విలాసాలకి అలవాటు పడ్డ మోడీ 

Advertisement

ఇక బిజేపీ గొప్పగా చెప్పుకునే అయోధ్యలోనే పరాజయం పాలయిందని, అక్కడి నిదులతోనే ఇతర పార్టీలకి చెందిన ఎమ్మెల్యేలని, ఎంపీలని కొనుగోలు చేశారని చెప్పుకొచ్చాడు.ఏ దేశంలో అయినా ప్రధాని ప్రజలకి దగ్గరగా ఉండాలని, అంతే కాని విలాసవంతమైన జీవితం గడుపుతూ ప్రజలకి దూరంగా జరగకూడదని, ప్రస్తుతం మోడీ అలాగే విలసాలని అనుభవిస్తూ ప్రజలతో బందాన్ని తెంచుకుంటున్నాడని ఫైర్ అయ్యాడు.

బాధ్యత ఉంది  కాబట్టే 

ఇక వచ్చే రోజుల్లో మోడీనే అధికారాన్ని కోల్పోతాడా లేక ప్రజలే ఆయన్ని అధికారం నుండి దూరం చేస్తాడా అనేది ఎదురు చూడాలని తెలిపాడు. వచ్చే రోజుల్లో మన దేశ భవిష్యత్ ని మార్చే ప్రధానిని మనమే ఎన్నుకోవాలని పిలుపునిచ్చాడు ప్రకాష్ రాజ్.ఇక తాను ఈ సొసైటీ లో ఒక బాధ్యత కలిగిఉన్న నాయకుడిని కాబట్టే ఇలా భయం లేకుండా మాట్లాడుతున్నాని కుండబద్దలు కొట్టేశాడు.

ప్రజలు తెలివిగా ఆలోచించి  ప్రశ్నిస్తే 

Advertisement

ఇక చాలా మంది తనని సముద్ర తీర ప్రాంతాలకి వెళ్లాలని ట్రోల్ చేస్తున్నారని,నాలాగే అక్కడున్న ప్రజలు సముద్ర చేపలు తిని తెలివిగా ఆలోచించి మోడీని ప్రశ్నించడం మొదలుపెడితే మీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి అంటూ సెటైర్ వేశాడు.

also read :వయ్యారాలు ఒలకబోస్తున్న ప్రియాంక జైన్ .. చీరలో అదుర్స్!

ఇక సొసైటీలో అబద్దాలని పనిగట్టుకుని ప్రచారం చేసే నాయకులని ప్రజల నుండి దూరం చేయాలని, వారిని ఎరివేసే అవసరం ఎంతైనా ఉందని తెలిపాడు..ఇక దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించే పోరాటంలో మల్లికార్జున ఖర్గే వంటివారికి తామంతా అండగా ఉంటామని తేల్చి చెప్పాడు ప్రకాష్ రాజ్.

చూడాలి మరి ప్రకాష్ రాజ్ వేసిన ఈ సెటైర్లకి ఎవరు ఎలా ఎప్పుడు రియాక్ట్ అవుతారో !

Tags

Related News

కాలేజీల్లో సినిమా ఫంక్షన్లు.. అవసరమా?

NBK111.. మాస్ జాతరకు డేట్ ఫిక్స్!

పరికిణీలో కుర్రకారు హృదయాలు దోచుకుంటున్న ‘రంభ ఊర్వశి మేనక’ బ్యూటీ!

‘టాక్సిక్’ ఎఫెక్ట్.. రవితేజ ‘ఇరుముడి’కి నష్టం తప్పదా?

వందకోట్ల ‘ఇరుముడి’?– ఇదీ రవితేజ స్టామినా !

అడ్వాన్స్ బుకింగ్స్ లో టాక్సిక్ సరికొత్త రికార్డు.. ‘A’ వచ్చినా డోంట్ కేర్!

మళ్లీ మొదలైన స్పిరిట్ వివాదం.. లాభాల్లో వాటాపై దీపిక కౌంటర్!

Big Stories

Advertisement
×