BigTV English

Jaggareddy Vs ktr: కేటీఆర్‌పై పంచ్‌లు.. వారంతా డ్రామా ఆర్టిస్టులు-జగ్గారెడ్డి

Jaggareddy Vs ktr: కేటీఆర్‌పై పంచ్‌లు.. వారంతా డ్రామా ఆర్టిస్టులు-జగ్గారెడ్డి

Jaggareddy Vs ktr: మాజీ మంత్రి కేటీఆర్‌పై తనదైన శైలిలో పంచ్‌ డైలాగ్స్ విసిరారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఆయన పదేళ్లు మంత్రిగా పని చేసినా ఇంకా పొలిటికల్ మెచ్యూరిటీ రాలేదన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు నీకు చిల్లర పార్టీ అయ్యిందా? అంటూ రుసరుసలాడారు.


కాంగ్రెస్ త్యాగాల పార్టీ అయితే.. కల్వకుంట్లది డ్రామాల కుటుంబంగా వర్ణించారు. వాళ్ల తాత బతికుంటే కేటీఆర్ వ్యాఖ్యలు విని కాస్త బుద్ది పెట్టేవారన్నారు. తెలంగాణ ఉద్యమంలో దీక్ష ప్లాన్ అంతా కాంగ్రెస్ డిజైన్ చేసిందని, జాక్‌పాట్ కేసీఆర్‌కు తగిలిందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రం రావడం వల్ల కేసీఆర్ పుణ్యమాని 7 లక్షల కోట్ల అప్పు ఉందని, అదొక రికార్డుగా వర్ణించారు. ఈ విషయంలో ఆ కుటుంబం, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలన్నారు. తెలంగాణ వచ్చాక ఫ్యామిలీ అంతా సోనియాగాంధీ ఇంటికి వెళ్లడం అప్పుడు చిల్లర అనిపించలేదా? అంటూ ప్రశ్నించారు. అప్పుడు లేనిది ఇప్పుడెలా అనిపిస్తుందన్నారు.


మీ కుటుంబం వెలిగిపోతుందంటే దానికి కారణం కాంగ్రెస్ కాదా? కాంగ్రెస్‌పై మాట్లాడిన కేటీఆర్ క్యారెక్టర్ లెనోడని తేల్చేశారు. సోనియా వల్లనే తెలంగాణ వచ్చిందని ఆనాడు సభలో కేసీఆర్ చెప్పారని, ఆ మాట నువ్వు మర్చిపోయావా? కాంగ్రెస్ థర్డ్ క్లాస్ పార్టీ ఐతే, ఆ పార్టీ నుంచి మీ నాన్న పాఠాలు నేర్చుకున్నారని వ్యాఖ్యానించారు. మీ నాన్న కూడా థర్డ్ క్లాసే కదా? పంచ్ డైలాగ్స్ విసిరారు.

ALSO READ: కేసీఆర్‌కు హైకోర్టు ఝలక్.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం

థర్డ్ క్లాస్ నుండే కదా నువ్వు రాజకీయ నాయకుడి అయ్యావని, వంద కోట్ల ప్రజలకు స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీని థర్డ్ క్లాస్ అనడానికి మనసు ఎట్లా వచ్చిందని కాసింత రుసరుసలాడారు. కాంగ్రెస్ అంటే ఏంటో కేసీఆర్‌ని కేటీఆర్ అడిగి తెలుసుకుంటే బాగుంటుందన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మీ కుటుంబం వేల కోట్లు సంపాదించే అవకాశం రాకుండేదన్నారు.

అమెరికా‌లో జీతం మీద జీవనం సాగించలేదా? తెలంగాణ బిడ్డగా సుదర్శన్‌రెడ్డిని ఉప రాష్ట్రపతి అభ్యర్ధి‌గా పెడితే ఆయనకు ఓటేయాల్సింది పోయి, కాంగ్రెస్ మీదనే ఆరోపణలా? కేటీఆర్-కేసీఆర్‌వి అవకాశవాద రాజకీయాలకు పరాకాష్టగా చెప్పారు. పదేళ్లు మంత్రిగా ఉన్న రాజకీయ మెచ్యూరిటీ రాలేదన్నారు. అందుకే ప్రతీ మాటకు దొరికిపోతున్నావని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

త్యాగాలకు కేటీఆర్‌కి విలువ తెలియదని, వీళ్ళంతా డ్రామా ఆర్టిస్టులుగా వర్ణించారు. కేసీఆర్ 11 రోజులు దీక్ష చేయగలడా? తిని దీక్ష చేసినా అప్పుడు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందన్నారు. తెలంగాణ వచ్చి ప్రజలకు బెనిఫిట్ ఏమైందో తెలియదుగానీ, కేసీఆర్ కుటుంబానికి మాత్రం బెనిఫిట్ అయ్యిందన్నారు.

కేటీఆర్ తొందరపడి మాట్లాడి కిషన్ రెడ్డి కి అవకాశం ఇచ్చినట్టు అయ్యిందన్నారు. సచివాలయంలో దందా చేస్తే తప్పు కానీ ప్రజల కోసం సమీక్ష చేస్తే తప్పా అని అడిగారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మంచోరని, సౌమ్యుడని, ప్రాబ్లం ఏంటంటే ఆయన కూడా స్క్రిప్ట్ లీడరని వ్యాఖ్యానించారు.

ప్రచారక్ రాసి ఇచ్చింది చదువుతారని, పొలిటికల్ స్పీచ్ లు ఇవ్వలేరన్నారు. యూరియా మీరు ఇవ్వకుండా మాట్లాడితే ఏం లాభం ఉంటుందని, కాంగ్రెస్‌ని బద్నాం చేయాలని ఎరువులను అడ్డం పెట్టుకుని బీజేపీ డ్రామా ఆడుతోందన్నారు. రైతుల ముసుగులో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారన్నారు. రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తాయని, రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు జగ్గారెడ్డి.

 

Related News

Heavy Rains: రాష్ట్రంలో మళ్లీ కుండపోత వానలు.. రెండ్రోజులు ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, భారీ పిడుగులు..?

Harish Rao: తెలంగాణ బీజేపీ ఎంపీలకు హరీష్ రావు సవాల్.. ఆ విషయంలో కేంద్రాన్ని అడిగే దమ్ముందా..?

Telangana Jagruthi: కవిత సమక్షంలో.. బీఆర్ఎస్ నుంచి జాగృతిలో చేరికలు

Hyderabad Real Estate: MSN రియాల్టీ సంస్థ సరికొత్త రికార్డ్.. ఎకరా స్థలం రూ.177 కోట్లకు కొనుగోలు

Telangana Pharma Hub: ఫార్మా ఇండస్ట్రీలో మరో మైలురాయి.. హైదరాబాద్ నుంచే ప్రపంచ స్థాయి ఔషదాల తయారీ

Election Code: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. హైదరాబాద్‌లో ఎన్నికల కోడ్ అమలు

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..

BC Reservations: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్.. బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేత..

Big Stories

×