BigTV English
Advertisement

TPCC: కొత్త బాస్ ముందున్న.. అతిపెద్ద సవాల్

TPCC: కొత్త బాస్ ముందున్న.. అతిపెద్ద సవాల్

– టార్గెట్ ఫిక్స్ అయిన టీపీసీసీ కొత్త చీఫ్
– త్వరలోనే పార్టీ కమిటీల నియామకం
– అందర్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని స్పష్టం
– స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా
– సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టితో భేటీ
– పీసీసీ కొత్త చీఫ్‌ను సన్మానించిన నేతలు


Challenges ahead of tpcc new chief mahesh kumar goud: టీపీసీసీ కొత్త చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్ నియామకంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఏఐసీసీ ఏ లక్ష్యంతో ఈ ఎంపిక చేసిందనే దానిపై రాష్ట్రమంతా తెగ మాట్లాడుకుంటున్నారు. సామాజిక సమీకరణాల దృష్యా చూస్తే బీసీకి పీసీసీ పదవి కట్టబెట్టడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్టు కనిపిస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ఎంపిక పార్టీకి ప్లస్ అవుతుందని, ఆ లక్ష్యంతోనే పీసీసీ అధ్యక్ష పదవిని బీసీకి ఇచ్చినట్టుగా రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.

సీఎంను ఫాలో అవుతున్న కొత్త బాస్


టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చాక రేవంత్ రెడ్డి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ అధిగమించి తర్వాత పీసీసీ చీఫ్ పదవి దక్కించుకున్నారు. ఆ సమయంలో పార్టీలో ఉన్న అందర్నీ ఎలా సమన్వయం చేసుకుంటారో అన్న ప్రశ్న ఎదురవ్వగా, వాటన్నింటికీ జవాబుగా సీనియర్ నేతలను వరుసగా కలిసి, కలిసికట్టుగా పనిచేద్దాం అనే సంకేతం ఇచ్చారు. ఇప్పుడు పీసీసీ కొత్త చీఫ్ మహేష్ కుమార్ కూడా ఇదే స్ట్రాటజీతో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఏఐసీసీ నుంచి అనౌన్స్ మెంట్ వచ్చాక, పార్టీలోకి అందరి నేతలను ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. తర్వాతి రోజు సీఎం, డిప్యూటీ సీఎం, ఇంకా ఇతర నేతలను కలుస్తున్నారు. పదవి కోసం తనతో పోటీ పడిన వారినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని చెప్తున్నారు.

రేవంత్‌, భట్టితో భేటీ

శనివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు మహేష్ కుమార్ గౌడ్. సీఎం నివాసంలో ఏర్పాటు చేసిన గణపతి పూజలో కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కంగ్రాట్స్ చెప్తూ శాలువాతో సన్మానించారు. ఇటు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రజాభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు మహేష్ కుమార్ గౌడ్. ఆయన వెంట వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ఉన్నారు. నూతనంగా నియామకమైన వీరు డిప్యూటీ సీఎంను కలిసి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకొందరు కీలక నేతలతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ అవుతారని తెలుస్తోంది.

Also Read: Game Changer: గేమ్ ఛేంజర్ అప్డేట్.. ఎర్ర కండువాతో చరణ్ అదిరిపోయాడు

టార్గెట్ ఫిక్స్ అయిన మహేష్ కుమార్

స్థానిక సంస్థల ఎన్నికలే తన ముందున్న అతిపెద్ద సవాల్ అంటూ కుండబద్దలు కొట్టేశారు మహేష్ కుమార్ గౌడ్. సూటిగా సుత్తి లేకుండా తన టార్గెట్ ఏంటో ఫిక్స్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలే తన ముందున్న సవాల్ అని అన్నారు. తన పదవి కోసం పోటీ చేసిన వారితోనూ కలిసి ముందుకెళ్తానని, అందర్నీ సమన్వయం చేసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. రెండు మూడు రోజుల్లోనే టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకుంటానని, ప్రభుత్వానికి, పార్టీకి వారధిగా ఉంటానని స్పష్టం చేశారు. త్వరలోనే కమిటీలను నియమిస్తామని, ఖాళీగా ఉన్న పార్టీ పదవులను భర్తీ చేస్తామని చెప్పారు. గత పేదళ్లుగా పార్టీనే నమ్ముకున్న వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు మహేష్ కుమార్ గౌడ్.

Related News

Deputy CM Bhatti: వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ ఏర్పాటు ఆలోచనలో ప్రభుత్వం: డిప్యూటీ సీఎం భట్టి

Jubilee hills elections: జూబ్లీహిల్స్ అభివృద్ధి బాధ్యత మాది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Jubilee Hills bypoll: కేటీఆర్ రాజీనామాకు సిద్ధంగా ఉండు.. చలో ఏదో ఒకటి తేల్చుకుందాం: సీఎం రేవంత్ రెడ్డి

Bhatti Vikramarka: “కాంగ్రెస్ అంటేనే కరెంట్” పరిగిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యలు

Nagarkurnool: కల్వకుర్తిలో దారుణం.. వివాహేతర సంబంధం నెపంతో ఒకే కుటుంబంపై వేట కొడవళ్లతో దాడి

CM Revanth Reddy: జూబ్లీలో మోదీ, కేసీఆర్ ఓవైపు.. రాహుల్ గాంధీ నేను ఓవైపు.. ఇక తాడోపేడో తేల్చుకుందాం: సీఎం రేవంత్

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Kalvakuntla Kavitha: జూబ్లీహిల్స్ బైపోల్‌.. బీఆర్ఎస్‌కు కవిత గండం

Big Stories

×