Man Dies in Israel: ఇజ్రాయిల్‌లో ప్రాణాలు కోల్పోయాడు జగిత్యాలకు చెందిన రవిగౌడ్. ఉపాధి కోసం దేశంకాని దేశం వెళ్లిన ఆయన.. 20 రోజుల క్రితం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరాడు. ఇంతలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రమైంది. ఇజ్రాయిల్‌పై ఇరాన్ వేస్తున్న బాంబులు, క్షిపణులతో.. ఆ శబ్దానికి భయపడి హాస్పిటల్‌లోనే రవిగౌడ్ మృతి చెందారు. డెడ్‌బాడీని స్వగ్రామానికి తెప్పించాలని ఆయన కుటుంబం ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.
కాగా.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుంది. అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రెయెల్ దాడులు చేస్తుండగా.. ఆ దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాలపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తుంది. ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడి చేసింది. అత్యంత కచ్చితత్వంతో క్షిపణులు ప్రయోగించింది. గ్లిలాట్‌లోని ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్‌పైనా దాడి చేసింది.
ఇరాన్‌పై పక్కా ప్రణాళికతో దాడులు చేసేందుకు మొస్సాద్ సంస్థ ఇజ్రాయెల్‌కు కీలకం. ఇరాన్‌లో అణు స్థావరాలు ఎక్కడెక్కడున్నాయి.. సైంటిస్ట్‌ల ఇళ్లులు, కీలక ఆధారాలన్నీ ఇజ్రాయెల్‌కు చేరవేస్తుంది. ఇరాన్‌కు భారీ మొత్తంలో డ్రోన్లను తరలించి ఇజ్రాయెల్ కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించడం వెనుకా ఈ సంస్థ హస్తముంది. చర్చలకు సిద్ధం అంటున్న ఇరాన్.. దాడులు మాత్రం ఆపడం లేదు.
ఇక తాజాగా ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్‌కి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికీ ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఆయతుల్లా ఖమేనీని అంతమొందించడం తమకు పెద్ద సమస్య కాదని.. కానీ ప్రస్తుతానికి అలా చేయడం లేదన్నారు. అమెరికా ఖచ్చితమైన స్థావరాలు గుర్తించి దాడి చేయగలదని, లొంగిపోతే బాగుంటుందని తెలిపారు. సామాన్యులు, అమెరికా సైనికులపై క్షిపణి దాడులు చేయడం అమెరికా సహించదన్నారు. ఈ విషయంపై ఇరాన్‌కు స్పష్టత ఉండటం సంతోషించ దగ్గ విషయం. తమకు సహనం నశించక ముందే లొంగిపోవడం మంచిదని వార్నింగ్ ఇచ్చారు.
ఇరాన్ గగనతలం మొత్తం తమ నియంత్రణలోనే ఉందన్నారు ట్రంప్. స్కై ట్రాక్టర్లు, గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ వద్ద ఉన్నా.. వాటిని అమెరికా టెక్నాలజీతో పోల్చలేమన్నారు. మరోవైపు ఇరాన్ సైనిక స్థావరాలు, అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంది. ఈ క్రమంలో ఇరాన్ ఖమేనీని సురక్షిత ప్రాంతాలకు తరలించి, బంకర్‌లో దాడిపెట్టారు. ఈశాన్య టెహ్రాన్‌లోని ఓ బంకర్‌లో కుటుంబంతో కలిసి ఖమేనీ తలదాచుకున్నట్లు తెలియడంతో.. ట్రంప్ హెచ్చరికలు చేశారు.
Also Read: టక్కరి ట్రంప్ పరుగులు.. ఆ దేశాల కోసమేనా..! అణు యుద్ధం ఎప్పుడంటే?
ఇటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఇరు దేశాల మధ్య ఉద్రితిని పెంచడం కంటే.. యుద్ధాన్ని త్వరగా ముగించడమే తమ లక్ష్యం అన్నారు. దానికి ఖమేనీని చంపడం మాత్రమే యుద్ధానికి ముగింపు అన్నారు. ఇరాన్‌లో జరుగుతున్న హింస ఇప్పటికే 200 మందికి పైగా ప్రాణాలను బలిగొంది. వీరిలో ఎక్కువ మంది సామాన్యులే. కనీసం 24 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. ఇరుపక్షాల మధ్య క్షిపణి, డ్రోన్ దాడులు జరుగుతున్నాయి.