Intinti Ramayanam Today Episode june 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి వాళ్ళ నాన్న చక్రధరి ఇంటికి వెళ్లడం చూసిన శ్రీకర్ అక్కడికి వచ్చి కిటికీలో ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని అనుకుంటారు.. శ్రీకర్ రాకముందు ఆ ఇంటిని ఎలాగైనా నా సొంతం చేసుకోవాలని మాట్లాడిన పల్లవి శ్రీకర్ వింటుండడం చూసి ప్లేట్ ఫిరాయించి కుటుంబం కోసం బాధపడుతున్నట్లు మాట్లాడుతుంది. ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావట్లేదు. చక్రధర్ ఇద్దరు కూడా మాట్లాడుకోవడం చూసి శ్రీకర్ మా వాళ్ల గురించి పాజిటివ్ గా పల్లవి మాట్లాడుతుంది ఏంటి అని ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. అక్షయ్, పార్వతి, భానుమతిలు గుడికి చేరుతారు.. గుడికి వచ్చిన అవని తన కుటుంబ సభ్యులు ఇలా చెల్లాచెదురుగా అయిపోవడం చూసి దేవుడితో బాధపడుతూ మొరపెట్టుకుంటుంది. ఇకమీదటైనా అక్షయ్ తప్పు తెలుసుకొని మంచిగా ఉంటే బాగుంటుంది అని దండం పెట్టుకుంటుంది. అప్పుడే గుడిలో ఉన్న వాళ్ళని చూసి షాక్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వీళ్ళు ఎలా అయిపోయారు అని బాధపడుతుంది. అయితే అవని వాళ్ళని చూసి వాళ్ళకి ఏదైనా చేస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. తన వాళ్లను గుడిలో చూడలేని అవని ఓ ఇంట్లో పెట్టాలని అనుకుంటుంది. అనుకున్నట్లుగానే అవని తన వాళ్లను ఇంట్లోకి చేరుస్తుంది.. అయితే అవని రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు.. అయితే భానుమతి రాజేంద్రప్రసాదం చూసి ఎమోషనల్ అవుతుంది.. అరే రాజేంద్ర చూడ్డానికి వచ్చావా రా? చూసావా రా అమ్మ పరిస్థితి ఎలా మారిందో అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వు కన్న తల్లివి కాబట్టి ఆ బాధను చూడలేక కొడుకుని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చావు. కానీ నీ కోడలు మొగుడు వచ్చాడు అని కూడా చూడట్లేదు ఏంటమ్మా ఇది అని అంటాడు.
పార్వతి పెళ్ళాం పిల్లలు అవసరం లేదని కోడలే ముఖ్యమని వెళ్లిన వారితో ఎలా మాట్లాడాలో చెప్పండి అత్తయ్య గారు అని అంటుంది. మేము ఈ పరిస్థితికి రావడానికి ఆవిడ గారు అన్న సంగతి ఆయన ఇంకా గుర్తించలేదు అని రాజేంద్రప్రసాద్ తో పార్వతి ఇండైరెక్టుగా అంటుంది. మీరు ఆగండి మావయ్య గారు అని అవని అత్తయ్య మీరు ఇప్పుడు ఇలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. మేము ఈ పరిస్థితికి రావడానికి కారణం నువ్వే.. మా కుటుంబం ముక్కలవ్వడానికి కారణం నువ్వే.. ఇన్ని చేసిన నువ్వు ఇప్పుడు మా సంతోషం గురించి మాట్లాడుతున్నావా అని అవనిని దారుణంగా అవమానిస్తుంది.
ఇక రాజేంద్రప్రసాద్ అక్షయ్ ని అవని కన్నా నాకు బాగా తెలుసు అవనీకి ఏం తెలుసు అని నన్ను ఆరోజు అన్నావు కదా.. ఏం తెలుసని ఇప్పుడు ఈ పరిస్థితికి తీసుకొచ్చావు అని రాజేంద్రప్రసాద్ అంటాడు. నీ పరిస్థితిలోకి రావడానికి కారణం అవనీని అని అక్షయ్ అనగానే రాజేంద్రప్రసాద్ పెద్ద క్లాసే పీకుతాడు. నువ్వు తప్పు చేసి నీ తొందరపాటుతో ఆస్తినంతా పోగొట్టి ఇప్పుడు అవని తప్పు చేస్తుందని అంటావా అని రాజేంద్ర ప్రసాద్ అంటాడు. ఇదంతా కాదు కానీ వీళ్లు నీ మంచితనాన్ని అర్థం చేసుకోరు కానీ మనం వెళ్ళిపోదాం పద అని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు.
ఇంటికి వచ్చిన శ్రీకర్ కమల్ ని పిలుస్తాడు. ఇల్లంతా ఇంత ప్రశాంతంగా ఉంది ఏంటి. ఇంట్లో ఎవరూ లేరా అని అడుగుతాడు. వీళ్ళిద్దరూ ఇంట్లో మనుషులతో మాట్లాడటం మానేసి నువ్వు గొప్ప నువ్వు గొప్ప అని పోట్లాడుకోవడం సరిపోతుంది కదా అన్నయ్య ఎక్కడో చోట కూర్చొని ఉంటారులే అని కమల్ అంటాడు. పల్లవిశ్రియాలను పిలుస్తారు. ఆ రోజు వంట ఏం చేస్తున్నారు చెప్పండి అని అడుగుతారు. అయితే వంట మేం చేసేదేంటి వంట మనిషి రాలేదని పల్లవి అడుగుతుంది. దానికి కమల్ వంట మనిషి ఇకమీదట నుంచి రాదు. మీరిద్దరు ఉన్నారు కదా.. నలుగురమే కదా.. మీరే వంట చేయాలి లేదా అమ్మ నాన్నమ్మలు వెళ్లిపోయినట్లు వీళ్ళిద్దరిని కూడా మనం బయటకు పంపించేసి హ్యాపీగా ఆర్డర్ పెట్టుకొని తిందామని కమలంటాడు.
వీళ్ళు కచ్చితంగా అన్నట్లే చేస్తారని శ్రియ పల్లవి ఇద్దరు షాక్ అవుతారు. వెంటనే మేం వంట చేస్తామని అంటారు. అయితే టాస్ వేసుకుని ఎవరు వంట చేస్తారో చేయండి అని అంటారు. శ్రియ వంట చాలని వస్తుంది. పల్లవి ఇంట్లో పని అంతా చూసుకోవాలని కమల్ ఆర్డర్ వేస్తాడు.. ఇక నువ్వు వంట చేయకపోతే నీ మొగుడు ఏమన్నాడో కానీ నా మొగుడు మాత్రం ఏది దొరికితే దాంతో కొడతాడని పల్లవి పనిచేయడానికి వెళ్ళిపోతుంది. తన అత్త వాళ్లకి బయట ఫుడ్డు పడదు అని ఇంట్లో టిఫిన్ చేసి బాక్స్ పెడుతుంది. రాజేంద్రప్రసాద్ ఎంత చెప్పినా కూడా అవని వినకుండా టిఫిన్ బాక్స్ పెట్టేస్తుంది. ఇక భానుమతికి టిఫిన్ తీసుకెళ్లి పెడుతుంది.
శ్రీకర్ కమల్ ఇద్దరూ అమ్మ వాళ్ళు ఎక్కడున్నారని వెతుకుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదు కదా అని మాట్లాడుకుంటూ వెతుకుతారు. టిఫిన్ తీసుకెళ్లా అవనీని అక్షయ్ పార్వతి దారుణంగా మాటలతో అవమానిస్తారు. భానుమతి మాత్రం టిఫిన్ కోసం అవనికి సపోర్ట్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..