Jana Reddy: రేవంత్ సర్కార్ చేపట్టిన కులగణనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. మల్లన్నను ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయినప్పటికీ నిత్యం ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉన్నారు. కులగణనలో కాంగ్రెస్ సీనియర్ నేతల పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. జానా రెడ్డి పాత్ర కూడా కులగణనలో ఉందని తీవ్ర విమర్శలు చేశారు.
గాలి మాటలు మాట్లాడితే కుదరదు: జానా రెడ్డి
ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి రియాక్ట్ అయ్యారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణన అంశంలో అసలు తన పాత్ర లేదని తేల్చి చెప్పారు. గాలి మాటలు మాట్లాడితే కుదరదని జానారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేసిన వాడిని క్షమించే గుణంలో ముందుండే వాడిని తానని చెప్పుకొచ్చారు. తనను ఎవరు తిట్టినా.. పట్టించుకోని వ్యక్తినని అన్నారు. తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ పెట్టుకుంటే నాకేంటి.. ఇంకేమైనా చేసుకుంటే నాకేంటి.. ఏమైనా చేసుకోనివ్వు.. తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. సలహాలు అడిగితే మాత్రం ఇస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తెలిపారు.
ALSO READ: IPPB Recruitment: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. రూ.30,000 వరకు జీతం.. జస్ట్ ఇంటర్వ్యూతో జాబ్ భయ్యా..
పరిపాలన చేసే వారు సైతం అడిగితేనే సలహాలు సూచనలు ఇస్తానని జానా రెడ్డి చెప్పారు. తమ పార్టీ నాయకులు తనను విమర్శిస్తే… ఖండించడం లేదు.. అలాగని సమర్థించడం లేదు.. ఎందుకో వారినే అడిగి తెలుసుకోండని అన్నారు. కేసీఆర్ పాత్ర ఏంటి అనేది ప్రజలే నిర్ణయిస్తారని జానా రెడ్డి వ్యాఖ్యానించారు. ఏస్తు క్రీస్తు చెప్పిన గుణాలు కలిగిన వాడిని తానని చెప్పుకొచ్చారు.
నాకు ఎలాంటి సంబంధం లేదు: వీహెచ్
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై మరో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు రియాక్ట్ అయ్యారు. మల్లన్న కామెంట్స్ అంశంపై తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అంతా పార్టీనే చూసుకుంటుందని చెప్పారు. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని తెలంగాణ ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు చెప్పానని అన్నారు. ‘ఆమె నన్ను ఏమి అడగలేదు.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని మీనాక్షి నటరాజన్‌కు సూచించాను’ అని వీహ్ హనుమంతరావు వ్యాఖ్యానించారు.
ALSO READ: AAI Recruitment: బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.40,000 జీతం.. మరి ఇంకెందుకు ఆలస్యం..
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఖండించిన మంత్రి సీతక్క
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను మంత్రి సీతక్క కూడా ఖండించారు. కార్యకర్తల శ్రమతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. కొందరు కావాలనే బీజేపీ, బీఆర్ఎస్ గొంతుకలై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము విజయవంతంగా కులగణన చేశామని చెప్పారు. బీఆర్ఎస్ చేయలేనిది తాము చేసి చూపించామని.. అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. కులగణనపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. శానసనమండలిలో మాట్లాడుకోవచ్చని చెప్పారు. కులగణనకు తమ ప్రభుత్వం 50 రోజుల సమయం ఇచ్చాం.. అది సరిపోదా అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.