Tarun Bhaskar : టాలీవుడ్ యంగ్ డైరెక్టర్లలో తరుణ్ భాస్కర్ కూడా ఒకరు.. విజయ్ దేవరకొండ నటించిన హిట్ మూవీ పెళ్లి చూపులు సినిమాతో తెలుగు తెరకు దర్శకుడుగా పరిచయమయ్యారు. చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయం సాధించిందీ చిత్రం. దీంతో తరుణ్ భాస్కర్ మీద అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఆపై తన నుంచి వచ్చిన సినిమాలు మెప్పించలేకపోయాయి.. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మూవీ కంటెంట్ ఉంది కానీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది దాంతో ఓ మోస్తారు హిట్ ను అయితే అందుకుంది. ప్రస్తుతం ఆయన డైరెక్షన్ తో పాటు నటుడుగా కూడా తన సత్తాని చాటుతున్నాడు. ఒకవైపు నటుడుగా మరోవైపు డైరెక్టర్ గా సినిమాలను చేస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఉంటాడు. తాజాగా ఈ డైరెక్టర్ వంట మనిషి అవుతారం ఎత్తాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. తరుణ్ భాస్కర్ వంట చేస్తూ కనిపిస్తాడు.. గరిట పట్టుకొని మటన్ కర్రీ వండుతున్నాడు. టాలీవుడ్ నటుడు ఇంట్లో కర్రీ చేస్తున్నాడు. ప్రాజెక్ట్ కె కోసం వంటను నేర్పిస్తున్నాడని అతను చెప్పడం అందులో కనిపిస్తుంది. ఆ వీడియోనే ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన వారంతా కూడా ఏంటి డైరెక్టర్ గారు ఈమధ్య సినిమాలు లేవా ఏంటి గరిట పట్టుకున్నారు అంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. మరో నెట్టిజను సినిమాలతో వచ్చే లాభాలు సరిపోవట్లేదా ఏంటి? గరిట పట్టుకొని వంట మాస్టర్ గా మారారంటూ కామెంట్ చేశారు. ఏది ఏమైనా కూడా ఒక డైరెక్టర్ అయ్యుండి ఇలా సింపుల్ గా వంట చేయడంపై ఆయన ఫ్యాన్సు ప్రశంసలు కురిపిస్తున్నారు. డైరెక్టర్ వంట వీడియోను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
Also Read : సింగర్ కల్పన సూసైడ్ కు కారణం కూతురా?.. విచారణలో విస్తుపోయే నిజాలు..
తరుణ్ భాస్కర్ సినిమాల విషయానికొస్తే.. ఈమధ్య ఈయన డైరెక్టర్ గా సినిమాలు చేసినట్లు కనిపించలేదు.. నటుడుగా పలు సినిమాల్లో నటిస్తూ తన టాలెంట్ ని బయటపెడుతున్నాడు. ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించాడు. అయితే తరుణ్ భాస్కర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈయన సినిమాల డైరెక్షన్ కన్నా నటన కే ఎక్కువ ప్రాదాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది.. విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు.. ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. యాక్టర్ తరుణ్ భాస్కర్ నటించిన ‘జాక్ రెడ్డి’ క్యారెక్టర్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.. ఆ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీలో డైరెక్టర్ పాత్ర ప్రత్యేకంగా నిలవనుందని తెలుస్తుంది. ఇక ఫ్యూచర్లో ఈ డైరెక్టర్ సినిమాలను డైరెక్ట్ చేస్తారేమో చూడాలి.