BigTV English

Jawan Gun Misfire In Hyderabad: హైదరాబాద్‌లో గన్ మిస్ ఫైర్..అపార్టుమెంట్‌లోకి దూసుకొచ్చిన బుల్లెట్

Jawan Gun Misfire In Hyderabad: హైదరాబాద్‌లో గన్ మిస్ ఫైర్..అపార్టుమెంట్‌లోకి దూసుకొచ్చిన బుల్లెట్

Jawan Gun Misfire In Hyderabad: హైదరాబాద్ నార్సింగిలో బుల్లెట్ కలకలం రేగింది. గన్ మిస్ ఫైర్ కావడంతో ఓ అపార్ట్ మెంట్‌లోకి బుల్లెట్ దూసుకొచ్చింది. ఆర్మీ జవాన్లు ప్రాక్టీస్ చేసే సమయంలో మిస్ ఫైర్ అయింది. దీంతో ఏకంగా ఆ బుల్లెట్ పక్కనే ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో దూసుకెళ్లడంతో ఐదో అంతస్తులో అద్దాలు ధ్వంసమయ్యాయి.


ఆర్మీ రేంజ్‌లో జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఓ గన్ మిస్ ఫైర్ జరిగింది. దీంతో నార్సింగిలోని బైరాగిగూడలో ఓ అపార్ట్‌మెంట్‌లోకి బుల్లెట్ దూసుకురావడంతో ఆ ప్లాట్ యజమానితో పాటు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

నార్సింగి పరిధిలోని బైరాగిగూడలో జరిగిన ఈ ఘటనపై ఇంటి యజమాని స్పందించాడు. కిటికీలోంచి ఓ బుల్లెట్ నేరుగా ఇంట్లోకి దూసుకొచ్చిందని వెల్లడించాడు. ఒక్కసారిగా అద్దాలు పగలడంతో భయాందోళనకు గురైనట్లు తెలిపాడు. మా కుటుంబ సభ్యులు బుల్లెట్ చూసి వణికిపోయారని చెప్పాడు.


Also Read: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ రిలీఫ్.. వారికి ఒకే సెంటర్లో పరీక్షలు

ఈ విషయంపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సదరు యజమాని వెల్లడించాడు. ప్రస్తుతం నార్సింగి పోలీసులు ఇంట్లోకి వెళ్లి బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.

Tags

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×