BigTV English

Ku Hostel: కేయూలో తప్పిన ప్రమాదం,గర్ల్స్‌ హాస్టల్‌లో స్లాబ్‌ పెచ్చులు ఊడి..

Ku Hostel: కేయూలో తప్పిన ప్రమాదం,గర్ల్స్‌ హాస్టల్‌లో స్లాబ్‌ పెచ్చులు ఊడి..

Kakatiya University Hostel Slap Cracks In Girls Hostel Again: తెలంగాణలోనే రెండో రాజధానిగా పేరున్న ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరుస ఘటనలు విద్యార్థులను హడలెత్తిస్తున్నాయి.ఈ మధ్యే హాస్టల్‌లో ఫ్యాను ఊడి మీద పడి తల పగిలిన ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ క్యాంపెస్‌లో.ఇలాంటి వరుస ఘటనలు అక్కడి విద్యార్థులకు కంటిమీద కునుకులేకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్ హాస్టల్ లో స్లాబ్ పై పెచ్చులు ఊడి కింద పడడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.


అదృష్టవశాత్తు ఈ ప్రమాదం జరిగే సమయానికి హాస్టల్‌లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.దీంతో హాస్టల్‌లో ఉండే గర్ల్స్ అందరూ ఊపిరిపీల్చుకున్నారు.ఎవరైనా జిల్లా అధికారులు వచ్చినప్పడు మాత్రమే ఇక్కడి అధికారులు హడావిడి చేశారు,కానీ హాస్టల్ లో ఉన్న వారిని చేంజ్ చేసే ప్రయత్నం అయితే ఎవరు చేయలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తరుచు ప్రమాదాలు జరుగుతున్న కాకతీయ యూనివర్సిటీలో ఎవరు పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోయారు.పురాతన భవనాలలో హాస్టల్స్ నిర్వహిస్తున్నారంటూ పలువురు బాలికలు బయట ప్రైవేట్ హాస్టల్‌లో డబ్బులు కట్టి మరి ఉంటున్న పరిస్థితి నెలకొంది.ఎప్పుడు ఏ భవనం పెచ్చులు ఊడి పడతాయా, ఎవరిపై ఫ్యాన్లు ఊడి పడతాయా అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థిని విద్యార్థులు గడుపుతున్న పరిస్థితి. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు ఈ ఘటనలపై స్పందించి కేయూలో కొత్త భవనాలను నిర్మించి విద్యార్థులకు అన్ని వసతులు ఉన్న భవనాలలోకి హాస్టల్స్ మార్చాలని విద్యార్థులు వేడుకుంటున్నారు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు.

Also Read: త్వరలో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమావేశం


ఇక ఇదే ఘటనపై ఈ మధ్యే హన్మకొండ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు అధికారులు వర్షాకాలం నేపథ్యంలో పురాతన భవనాలు కూలి ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో గత కొన్ని రోజుల క్రితం వాటి జాబితా సిద్ధం చేసింది. అంతేకాదు వాటి కారణంగా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కూల్చివేయాలని అన్నప్పటికీ..నగరంలోని కాలనీలలో ఉన్న భవనాలను చూస్తారే తప్ప ప్రభుత్వ హాస్టల్స్ కానీ ప్రభుత్వ ఆఫీసులను కానీ అధికారులు పట్టించుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి ఈ ఘటనపై సత్వరమే సమస్యను పరిష్కరించి విద్యార్థులకు తగిన న్యాయం చేయాలంటూ కేయూ క్యాంపస్ మెయిన్ గేట్ ఎదుట కేయూ స్టూడెంట్స్ ధర్నాకు దిగారు.

Tags

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×