Big Stories

Congress: థాక్రే ముందే తిరకాసు.. రేవంత్ రెడ్డి యాత్రపై కొర్రీలు.. అయినా తగ్గేదేలే

Congress: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు స్పీడు పెంచారు. నిత్యం ప్రజల్లో ఉండేలా… కార్యాచరణ రూపొందించారు. ఈ నెల 6 నుంచి నియోజకవర్గాల్లో హాత్‌ సే హాత్ జోడోయాత్ర ప్రారంభించనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మేడారం నుంచి యాత్ర మొదలుపెట్టనున్నారు. మరోవైపు కొత్త ఇంఛార్జ్ మాణిక్‌రావు థాక్రే ఎదుటే… రేవంత్ పాదయాత్రపై ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గాల్లోనూ పాదయాత్ర చేస్తామని అన్నారు.

- Advertisement -

కొత్త ఇంఛార్జ్ మాణిక్‌రావు థాక్రే ఎదుట… కాంగ్రెస్‌ నేతల మధ్య మరోసారి మనస్పర్థలు బయటపడ్డాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రపై ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. రాహుల్‌ చెప్పిన హాత్ సే హాత్ జోడో కాన్సెప్ట్ వేరు.. రేవంత్‌రెడ్డి చేస్తున్న పాదయాత్ర వేరు అని మహేశ్వర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు అధిష్టానం అనుమతి ఇవ్వలేదని అన్నారు. హాత్ సే హత్ జోడో యాత్రలో బ్లాకుల వారీగా పాదయాత్ర నిర్వహిస్తామని మహేశ్వర్ రెడ్డి చెప్పారు.

- Advertisement -

మహేశ్వర్‌రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ మాణిక్‌రావు థాక్రే సర్ది చెప్పారు. ఆసక్తి ఉన్న నియోజకవర్గాల్లో తిరగాలని మహేశ్వర్‌రెడ్డికి థాక్రే సూచించారు. నేతలు జనంలోకి వెళ్లడం ముఖ్యమని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా… హాత్ సే హాత్ జోడో యాత్ర ఈ నెల 6 నుంచి తెలంగాణలో ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి నాయకుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఠాక్రే చెప్పారు. రేవంత్ రెడ్డితో పాటు.. భట్టి విక్రమార్క , మధుయాష్కీ, ఉత్తమ్, ఇతర ముఖ్య నేతలు వివిధ ప్రాంతాల్లో ఈ యాత్రను మొదలుపెడతారని అన్నారు. రెండు నెలల పాటు సాగే యాత్రలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాల అసంబద్ధ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని మాణిక్ రావ్ ఠాక్రే ప్రకటించారు.

ఫిబ్రవరి 6న ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ నుంచి హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర ప్రారంభించనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. పాదయాత్ర మొదట విడత 60 రోజులు ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో దాదాపు 50 నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుందని చెప్పారు. మొదట విడత పాదయాత్ర పూర్తయిన తర్వాత.. రెండో విడత పాదయాత్రపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. పాదయాత్రలో భాగంగా వివిధ సందర్భాల్లో పార్టీకి చెందిన జాతీయ నాయకులు హాజరవుతారని రేవంత్ రెడ్డి తెలిపారు. రాజులు, రాచరికం మీద పోరాడిన సమ్మక్క, సారాలమ్మ స్ఫూర్తితోనే ఈ యాత్ర చేపడుతున్నానని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు.

6న ఉదయం 11 గంటలకు రేవంత్‌రెడ్డి సమ్మక్క, సారలమ్మకు పూజలు చేస్తారు. 12 గంటలకు పాదయాత్రగా బయల్దేరి.. కొత్తూర్‌, నార్లాపూర్ గ్రామాల మీదుగా ప్రాజెక్ట్ నగర్‌కు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి పాలంపేటలో రేవంత్ బస చేస్తారు. 7న రామప్ప ఆలయంలో పూజలు అనంతరం యాత్ర తిరిగి ప్రారంభిస్తారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌, బీజేపీలకు అడ్డుకట్ట వేసేలా… కాంగ్రెస్ నేతలు హాత్ సే హాతో జోడోయాత్రతో క్షేత్రస్థాయిలో ప్రజల్ని కలుసుకోనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News