JSW UAV In Telangana: దావోస్‌లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం సరికొత్త రికార్డును నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు భారీ పెట్టుబడులను సమీకరించింది. మూడు కంపెనీలతో రికార్డు స్థాయిలో అంటే దాదాపు 56 వేల కోట్లకుపైగా ఒప్పందాలు చేసుకుంది. వీటి ద్వారా తెలంగాణ యువతకు దాదాపు 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
తెలంగాణలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ స్థాపించనున్నట్లు జేఎస్ డబ్ల్యూ సంస్థ ప్రకటించింది. అమెరికాకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఈ యూనిట్ నెల కొల్పనుంది. ఈ యూనిట్ ద్వారా రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది ఆ కంపెనీ.
దీనికి సంబంధించి దావోస్ జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో జెఎస్ డబ్ల్యు డిఫెన్స్ అనుబంధ సంస్థ జె ఎస్ డబ్ల్యు యూఏవీ లిమిటెడ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ కంపెనీ ఎండీ పార్థ్ జిందాల్ తో-ప్రభుత్వ ప్రతినిధుల మధ్య జరిగిన ఒప్పందం జరిగింది. ఈ యూనిట్ ద్వారా 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు క్రియాశీలంగా మారనుంది. ఈ ఒప్పందంతో రక్షణ రంగంలో కీలక ఆవిష్కరణలతో పాటు డ్రోన్ టెక్నాలజీకి కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
ALSO READ: రాష్ట్రానికి రూ.45,500 కోట్లతో భారీ పెట్టుబడులు
ఈ ఒప్పందం రక్షణ రంగంలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. కేవలం ఇదే కాకుందా ఐటీ, ఫార్మాతో పాటు అన్ని రంగాల పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని తెలిపారు.
జేఎస్ డబ్ల్యూ సంస్థ తమ యూనిట్‌ను ఆదిభట్లలో నెలకొల్పే అవకాశముంది. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో ఏరో స్పేస్ పార్కుకు శంకుస్థాపన చేశారు. గతంలో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ అక్కడ పెట్టుబడులు పెట్టిన విషయం తెల్సిందే. మొత్తానికి ఆదిభట్ల ప్రాంతం డిఫెన్స్ ఉత్పత్తులకు కేరాఫ్‌గా మారనుంది.
The Government of Telangana has entered into a Memorandum of Understanding with JSW UAV Limited, a subsidiary of JSW Defence, to establish a state-of-the-art Unmanned Aerial Systems manufacturing facility in the State.
As part of this strategic initiative, #JSW UAV, in… pic.twitter.com/fFFQygcXCL
— Telangana CMO (@TelanganaCMO) January 22, 2025