BigTV English

Lavanya Tripathi Birthday : ఆమె అందం లావణ్యం.. మెగా కోడలిగా అందాల రాక్షసి ఫస్ట్ బర్త్ డే

Lavanya Tripathi Birthday : ఆమె అందం లావణ్యం.. మెగా కోడలిగా అందాల రాక్షసి ఫస్ట్ బర్త్ డే
Lavanya Tripathi Birthday

Lavanya Tripathi Birthday(Cinema news in telugu) :


పేరుకు తగ్గట్టే ఎంతో లావణ్యంగా, అందమైన రూపంతో ఆకట్టుకునే విధంగా ఉండే నటి లావణ్య త్రిపాఠి. ఈరోజు మెగా కోడలు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె గురించి బిగ్ టివి స్పెషల్ స్టోరీ.. అందాల రాక్షసి చిత్రంతో వెండితెరకు పరిచయమైన లావణ్య.. తన అందమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

డిసెంబర్ 15 , 1990లో ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించిన ఈ అందాల రాక్షసి.. తండ్రి లాయర్, తల్లి టీచర్. ఆమె విద్యాభ్యాసం అంతా డెహ్రాడూన్ లో జరిగింది. కెరీర్ ప్రారంభ దశలో  సిఐడి, ప్యార్ కా బంధన్ వంటి హిందీ సీరియల్స్ లో లావణ్య నటించింది.


హను రాఘవరెడ్డి డైరెక్షన్లో 2012లో వచ్చిన అందాల రాక్షసి చిత్రంతో లావణ్య టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. డబ్ల్యూ మూవీలోని తన అందం.. అంతకుమించిన అభినయంతో.. ప్రేక్షకులను మెప్పించింది. ఈ సొట్ట బుగ్గల సుందరి మొదటి సినిమా మంచి సక్సెస్ సాధించడంతో వరుస క్రేజీ ఆఫర్లు అందిపుచ్చుకుంది.అందాల రాక్షసి, దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, శ్రీరస్తు శుభమస్తు, యుద్ధం శరణం, ఉన్నది ఒకటే జిందగీ, అంతరిక్షం, సోగ్గాడే చిన్ని నాయనా, అర్జున్ సురవరం, లచ్చిమిదేవికి ఓ లెక్కుంది, ఏ1 ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా,హ్యాపీ బర్త్‌డే,మిస్టర్, రాదా లాంటి చిత్రాలలో నటించిన మెప్పించింది.బ్రమ్మన్, మాయవాన్ లాంటి తమిళ్ మూవీస్ లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

లావణ్య ప్రిన్స్ వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి గత కొన్ని సంవత్సరాలుగా సీక్రెట్ గా ప్రేమలో ఉన్నారు. శ్రీను వైట్ల డైరెక్షన్లో తెరకెక్కిన మిస్టర్ చిత్రంలో జోడిగా నటించిన ఈ ఇద్దరి పరిచయానికి పునాది ఇటలీలో పడింది. ఆ తర్వాత అంతరిక్షం మూవీ సమయంలో వీళ్ళ ప్రేమ బలంగా మారింది. అలా కొన్ని సంవత్సరాలు సీక్రెట్ లవ్ మైంటైన్ చేసి ఈ సంవత్సరం జూన్ లో నిశ్చితార్థంతో ఒకటయ్యారు. ఆ తర్వాత తమ ప్రేమకు సాక్షి అయిన ఇటలీలోనే పెళ్లి చేసుకుని సరికొత్త జీవితానికి నాంది పలికారు.

అందానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండే అందాల రాక్షసి కి బిగ్ టీవీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×