E-Paper
Advertisement

గవర్నర్ ను కలిసిన కవిత.. వినతి పత్రం అందజేత.. సీఎంపై ఘాటు విమర్శలు

గవర్నర్ ను కలిసిన కవిత.. వినతి పత్రం అందజేత.. సీఎంపై ఘాటు విమర్శలు
Advertisement

K Kavitha: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూసేకరణ, ఇండ్ల కూల్చివేతల వల్ల బాధితులుగా మారిన ప్రజల పక్షాన టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత, డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ గళమెత్తారు. బాధితులతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు కంటికి కనిపించడం లేదని ఈ సందర్భంగా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

భూసేకరణ నోటీసులు రద్దు చేయాలి

Advertisement

పరిగి మండలం కడ్లాపూర్ పరిధిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ఇచ్చిన భూసేకరణ నోటీసులను తక్షణమే రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు. భూమి కోల్పోయిన రైతు పరిస్థితి నీళ్ల నుంచి బయటపడిన చేపలా విలవిలలాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) అలైన్‌మెంట్ మార్పు, వెలుగుమట్లలో ఇండ్లు కూల్చివేతకు గురైన బాధితులందరికీ ప్రత్యామ్నాయంగా ఇంటి స్థలాలు కేటాయించాలని గవర్నర్‌కు విన్నవించారు. ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరిస్తుందని నమ్ముతున్నామని, లేదంటే ప్రజాక్షేత్రంలోనే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

కింద ఉన్న కల్లాలు కనిపించడం లేదా?

Advertisement

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ముఖ్యమంత్రి గారు విమానాల్లో దిల్లీకి చక్కర్లు కొడుతున్నారు కానీ, కింద ఉన్న కల్లాలు, రైతుల బాధలు కనిపించడం లేదు’ అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికే 80 శాతం ధాన్యం కొనుగోలు పూర్తి చేశామన్న ప్రభుత్వ వాదనలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. పాలకులకు రైతుల కష్టాలు తెలియాలంటే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని సూచించారు.

అధికారుల నిర్లక్ష్యం..

డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వేలాది ఎకరాల భూ దందా సాగుతోందని, దీనివల్ల రైతులు ఆగమైపోతున్నారని ఆరోపించారు. ఈ సమస్యలపై ఎంతమంది అధికారులకు మొరపెట్టుకున్నా ఎలాంటి లాభం లేకపోవడం వల్లే, చివరి ప్రయత్నంగా గవర్నర్‌ను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. గవర్నర్ చొరవ తీసుకుని బాధితులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Also Read: అన్నపైనే పడి ఏడుస్తావా? శర్మిలకు రాచమల్లు కౌంటర్.. బాబు మాటేంటి?

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×