E-Paper
Advertisement

ఆంధ్రాలో మనోళ్లకి ఉద్యోగాలిస్తారా? మరి తెలంగాణలో ఎందుకివ్వాలి? కవిత షాకింగ్ కామెంట్స్

ఆంధ్రాలో మనోళ్లకి ఉద్యోగాలిస్తారా? మరి తెలంగాణలో ఎందుకివ్వాలి? కవిత షాకింగ్ కామెంట్స్
Advertisement

Kalvakuntla Kavitha: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేవలం ఇంజనీరింగ్ చేసిన పొరుగు రాష్ట్రాల పిల్లలకు ఉద్యోగాలిస్తామని చెబుతున్నారని కవిత అన్నారు. ఇది చాలా అన్యాయమని ధ్వజమెత్తారు. తెలంగాణ బిడ్డలు కూడా ఆంధ్రాకి వెళ్లి ఇంజనీరింగ్ చేస్తే అక్కడ ఉద్యోగాలు ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. మన పిల్లల్ని అక్కడ నాన్-లోకల్స్ అంటారని పేర్కొన్నారు. మరి అక్కడి పిల్లలు ఇక్కడకు వచ్చి చదువుకున్నప్పుడు ఉద్యోగాలు ఎందుకివ్వాలని ప్రశ్నించారు.

హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ‘తెలంగాణ స్థానికత – సవాళ్లు’ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని కవిత మాట్లాడారు. స్థానికతపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని కవిత అన్నారు. లేదంటే నిరుద్యోగులతో కలిసి తాము పిటిషన్ వేస్తామని పేర్కొన్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ స్పిరిట్ ను న్యాయమూర్తులు అర్థం చేసుకోవాలని కవిత కోరారు. గ్రూప్- 1 నియామకాల్లో తెలంగాణ అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక జ్యూడిషియల్ రివ్యూ కమిటీ వేస్తామన్నారు.

Advertisement

గ్రూప్ 1 నియామకాల్లో బయట రాష్ట్రానికి చెందిన 11 మందికి ఈడబ్ల్యూఎస్, బీసీ డీ సర్టిఫికెట్లు ఇచ్చి వారికి ఉద్యోగాలు వచ్చేలా చేశారని కవిత పేర్కొన్నారు. ఇద్దరికి ఇవ్వాల్సిన ఉద్యోగాలను 9 మందికి అదనంగా ఇచ్చారన్నారు. పైగా వీటిని నిరుద్యోగులు సవాల్ చేయకుండా పెద్ద పెద్ద లాయర్లకు డబ్బులు ఇచ్చి కేసులను ప్రభుత్వం వాదింపజేస్తోందని దుయ్యబట్టారు. గత 6 వందల ఏళ్లుగా స్థానికేతరుల సమస్య మనల్ని వెంటాడుతూనే ఉందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో మన తెలంగాణ వాళ్లు నాలుగేళ్లు చదివితే వాళ్లను అక్కడ లోకల్ గా పరిగణిస్తారా? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు.

Also Read: పాత ఏసీ రిపేరా? కొత్తది కొనాలా? ఈ ‘3’ విషయాలు మర్చిపోకండి!

Advertisement

ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే మళ్లీ ముల్కీ రూల్స్ రావాల్సిందే అని అనిపిస్తోందని కవిత అన్నారు. ఇతర ప్రాంతాల వాళ్లు మన దగ్గర లోకల్ గా చేరి ఉద్యోగాలు తెచ్చుకుంటే 30 ఏళ్లు మన వనరులపై వాళ్లకు అధికారం వస్తుందన్నారు. ఇక్కడ పనిచేసే ఆఫీసర్లకు ఈ నేల బాధలు తెలవాలని.. వేరే వాళ్లకు ఉద్యోగాలు ఇస్తామంటే కష్టమని చెప్పారు. రేవంత్ రెడ్డి గ్రూప్ -1 లో ఇచ్చిన ఉద్యోగాలను తాము అధికారంలోకి రాగానే రివ్యూ చేస్తామన్నారు. జ్యూడిషియల్ కమిటీ వేసి వాటిలో మార్పులు చేసి తీరుతామన్నారు. తెలంగాణ తలరాతను మార్చే గ్రూప్ -1 ఉద్యోగాల్లో మన వారికి చేసిన అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు.

Also Read: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? ఈ 6 స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉంటే.. మీ జర్నీ సూపర్‌హీట్!

Related News

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వినాయక నిమజ్జనానికి ఆ రోజు సెలవు ప్రకటన

ఈ సారీ కొత్తగా అలా ప్లాన్ చేద్దాం.. గ్లోబల్ సమ్మిట్‌పై శ్రీధర్ బాబు కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×