E-Paper
Advertisement

కీసర 108 సిబ్బంది చేసిన పనికి ప్రశంసల జల్లు.. ఎం చేశారంటే?

కీసర 108 సిబ్బంది చేసిన పనికి ప్రశంసల జల్లు.. ఎం చేశారంటే?
Advertisement

Ambulance: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, శామీర్ పేట మండలంలోని ఉప్పర పల్లి గ్రామానికీ చెందిన బొంత కృష్ణ 50 సం, అనే వ్యక్తి కుటుంబ కలహాలతో ఈ రోజు ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు, వివరాల్లోకి వెళితే ఉప్పర పల్లి గ్రామానికీ చెందిన బొంత కృష్ణ అనే వ్యక్తి ఈ రోజు ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లి ఊరు బయట ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మ హత్య యత్నం చేసిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.

కీసర 108 సిబ్బంది..

ఊరు బయట అటుగా వెళ్తున్న ఊరు వాళ్ళు చూసి వెంటనే ఉరి తాడును తొలగించి, వేంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి,108 కాల్ చేశారు,108 కాల్ రావడంతో శామీర్ పేట అంబులెన్స్ సిబ్బంది మరొక ఎమర్జెన్సీ లో ఉండడంతో వెంటనే కీసర అంబులెన్స్ కి సమాచారం అందించారు సమాచారం అందుకున్న కీసర 108 సిబ్బంది చిత్రం రవి పైలట్ అఖిల్ వెంటనే హుటాహుటిన సంఘటన స్థలాన్ని చేరుకుని కృష్ణ ను అంబులెన్స్ లోకి తీసుకొని అత్యవసర వైద్య నిపుణుడు చిత్రం రవి వెంటనే అత్యవసర వైద్య పరీక్షలు నిర్వహించి, తీవ్రంగా శ్వాస సమస్యతో, నోటిలో ద్రవాలు అడ్డుగా ఉండడంతో శ్వాస మార్గానికి అడ్డంకులు ఏర్పడి స్రృహ కోల్పోయి విగత జీవిగా పడి ఉన్న వ్యక్తి కి అంబులెన్స్ లోనే అత్యవసర వైద్యం అందించారు.

Advertisement

Also Read: కొరియన్ కనకరాజు వెనుక వరుణ్ కష్టం.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్! 

అత్యవసర వైద్యం.. 

ఈ.ఆర్.సి.పి (ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ పిజిసియన్) సూచనలు సక్రమంగా పాటిస్తూ, నాడి వేగం పడిపోకుండా ఉండడానికి మరియు హృదయ స్పందన రేటు తగ్గకుండా ఉండడానికి ఆట్రోపిన్ ఇంజెక్షన్లు ఇచ్చి, శ్వాస మార్గానికి అడ్డుగా ఉన్న ద్రవాలను వాక్యూమ్ పరికరంతో సక్షన్ చేస్తూ శ్వాస మార్గానికి అడ్డంకులను తొలగిస్తూ, శ్వాస వేగం పడిపోకుండా ఉండడానికి ఆక్సిజన్ సరఫరా చేస్తూ, నాడి వేగం పెరగడానికి గ్లూకోస్ ద్రవాలు ఎక్కిస్తూ అంబులెన్స్ లోనే అత్యవసర వైద్యం అందించి,హాస్పిటల్ కి తరలించే వరకు ప్రాణాలు కాపాడిన కీసర 108 సిబ్బంది చిత్రం రవి పైలట్ అఖిల్ కు కృష్ణ కుటుంబ సభ్యులు చేతులెత్తి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు,మీరు చేసిన సేవకు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అని వారు కీసర 108 సిబ్బంది సేవలను కొనియాడారు.

Advertisement

Also Read: కూటమిలో విభేదాలు సృష్టించేందుకు కుట్ర.. బాలినేని డ్రామా బట్టబయలు చేసిన ఎమ్మెల్యే దామచర్ల!

Tags

Related News

తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలి: భట్టి విక్రమార్క

రోడ్డు భద్రతకు రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్.. టీజీ-మార్స్ ఏర్పాటు!

ఖైరతాబాద్‌లో బీజేపీకి అగ్ని పరీక్ష.. కిషన్ రెడ్డి ఏం చేస్తారు?

నిమజ్జనం చేస్తూ మూసీలో పడ్డ వ్యక్తి.. తృటిలో తప్పిన ప్రమాదం!

కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయి.. సజ్జనార్ తాట తీస్తాం.. పాడి కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు!

ఏ వేళలో ఏ విగ్రహం? ఖైరతాబాద్, బాలాపూర్ గణపయ్యల నిమజ్జనం టైమింగ్స్, రూట్ ప్లాన్ ఇదే!

మేం ఎన్నికలకు భయపడం.. ఖైరతాబాద్‌లోనూ కాంగ్రెస్‌దే గెలుపు: ఎంపీ చామల

ఆయిల్ పామ్ రైతులకు ఊహించని షాక్.. కేంద్రం నిర్ణయంపై భగ్గుమన్న మంత్రి తుమ్మల!

Big Stories

Advertisement
×