Adilabad Tragedy: అడవుల ఒడి ఆదిలాబాద్ జిల్లాలో ఎటుచూడు పచ్చదనమే కన్పిస్తుంది. అలాగే అక్కడి ఆదివాసుల మనసులు కూడా అంత స్వచ్చంగా వుంటయ్. ఇంటింటికి గ్యాస్ పోయి అన్నట్టు ఏ పల్లెలోనైనా.. ఏ ఇంట్లో నైనా గొడవలు కామనే. అలా వాంకిడి మండలం సోనాపురం గ్రామంలోని ఆత్రం కన్ను ఇంట్లో కూడా ఆడపాదడపా గొడవలు జరిగేవి. ఎందుకంటే ఆయనకు ఇద్దరు. మొదటి భార్య రాంబాయ్, రెండో ఆవిడ సుక్రుబాయి. ఆత్రం కన్ను ఆ ఇద్దర్నీ తన రెండు కళ్లలాగా చూసుకునేవాడు. కానీ ఇంట్లో కథ మరోలా ఉండేదట. ఒక ఒరలో రెండు కత్తులు ఇముడవనే ముచ్చట ఒట్టిగా వచ్చిందా?
సివిల్ వార్ లెక్క సవతుల పోరు..
సవతుల పోరు కామన్ సివిల్ వార్ లెక్కయిపోయింది. కాకా ఎంత కంట్రోల్ చేసినా కానీ ఇద్దరు భార్యల మధ్య కయ్యానికి కళ్లెం వేయలేకపోయాడు. ఫ్యామిలీవార్ మరింత ముదిరింది. ఈ నెల 5న ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ముందు వచ్చిన నన్నే ఎదరిస్తావా అంటూ ఆత్రం కన్ను పెద్ద భార్య రాంబాయి.. రెండో భార్య రాంబాయిపై కర్రతో దాడి చేసింది. తలకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు తరిలించారు. కానీ ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ సుక్రుభాయ్ చనిపోయింది. సోనాపురం పల్లె గొల్లుమంది. రాంబాయి గుండె గుబేల్మంది.
జైలుకు పంపిస్తారని భయం..
ఊళ్లోవాళ్లు తనను తలో మాట అంటారనుకుందో.. పోలీసు కేసై తనను జైలుకు పంపిస్తారని భయపడిందో.. ఎంత తిట్టుకున్నా ఎంత కొట్టుకున్నా కలిసే వుండేటోళ్లం కదా.. నా వల్ల చెల్లె చచ్చిపాయె అని బాధ పడిందో కానీ ఆవేశంలో ఆమె తీసుకున్న నిర్ణయం మరో అనర్ధానికి దారి తీసింది.
Also Read: కొత్త గ్లామర్‌తో మెరిసిపోతున్న బొగత జలపాతం.. మురిసిపోతున్న పర్యాటకులు!
పురుగుల మందు తాగిన రాంబాయి..
అసలే భయంతో వున్న రాంబాయి ఇంట్లో ఉండకుండా పొలాల దగ్గరకు వెళ్లింది. సుక్రభాయ్ పై దాడి కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సోనాపురం గ్రామానికి కు వెళ్లారు. రాంబాయి కొడుకును వెంటబెట్టుకొని ఆమె కోసం గాలింపు చేపట్టారు. సొలాల సైడ్ సెర్చ్ చేస్తుండగా ఓ చెట్టు కింద రాంబాయి కన్పించింది. పోలీసులు తనవైపు రావడం చూసిన రాంబాయి.. తనను పట్టు కెళ్తారని హడలిపోయిందో ఏమో పురుగుల మందును పెరుగన్నంలా గటగటా తినేసింది. పోలీసులు ఆమె దగ్గరకు చేరుకునేలోపే ఆమె సృహా తప్పి కిండపడపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రాణం దక్కలేదు. సుక్రభాయ్ హత్య కేసు విచారణ జరుగుతుండగానే రాంబాయి ఆత్మహత్య చేసుకోవడం సోనాపురంలో విషాదాన్ని నింపింది. ఆవేశం.. ఇలా అనర్ధానికి దారి తీసింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం పచ్చని గూడెంలో విషాదాన్ని నింపింది.