BigTV English

BRS Kavitha: కవిత కేక.. దడుసుకున్న దెయ్యాలు.. ఇక నెక్స్ట్ అదేనట!

BRS Kavitha: కవిత కేక.. దడుసుకున్న దెయ్యాలు.. ఇక నెక్స్ట్ అదేనట!

BRS Kavitha: తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలవరం రేపేలా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజా వ్యాఖ్యలు వెలువడ్డాయి. శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ అంతర్గత పరిస్థితులపై ఆమె తీవ్రస్థాయిలో స్పందించారు. గత రెండు వారాల క్రితం పార్టీ అధినేత కేసీఆర్‌కు రాసిన వ్యక్తిగత లేఖ బయటకు రావడం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.


నా కుమారుడి గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లిన తరువాతే ఈ లేఖ బయటకు వచ్చిందని తెలుస్తోంది అంటూ మొదలుపెట్టిన ఆమె వ్యాఖ్యలు ఒక్కటొక్కటిగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గతంలోనూ కేసీఆర్‌కు అనేక అభిప్రాయాలు లేఖల రూపంలో తెలిపానని చెప్పిన కవిత, ఈసారి బహిర్గతమైన లేఖ వల్ల పార్టీ పరువు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు.

బీఆర్ఎస్‌లో భేదాభిప్రాయాల ధ్వని?
కవిత వ్యాఖ్యలు చూస్తే, పార్టీ అంతర్గతంగా అసంతృప్తి రాజుకుంటున్నదని స్పష్టంగా అర్థమవుతోంది. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ, అధికశాతం ప్రజలు అనుకుంటున్న విషయాలే నేను లేఖలో రాశాను. ఇందులో నాకు ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం లేదు. ఎవరిపైనా ప్రేమ లేదు, ద్వేషం లేదని ఆమె చెప్పిన మాటలు కీలకంగా మారుతున్నాయి.


ఇది ఆమె వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాదని, పార్టీ అంతర్గతంగా చర్చించాల్సిన సమయమని, కోవర్టులు పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్నారని ఆమె అభిప్రాయపడడం, ఆ కోవర్టులే లేఖను బయటికి లీక్ చేశారన్న అనుమానాలకు తావిస్తోంది.

కేసీఆర్ చుట్టూ ‘దయ్యాలు’?
కవిత చేసిన అత్యంత సంచలనాత్మక వ్యాఖ్యే.. కేసీఆర్ దేవుడు. కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి. వాళ్ల వల్లే పార్టీకి నష్టం జరుగుతోంది. ఇది ఒక రకంగా పార్టీపై, పార్టీని నడుపుతున్న వ్యక్తులపై గట్టి విమర్శ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీకి నమ్మకం ఉందని ఆమె స్పష్టంగా చెబుతూనే, నేతల వల్లే క్రమంగా బలహీనపడుతోందన్న సంకేతాలను ఇస్తున్నారు.

లేఖ లీక్.. రాజకీయ కుట్రల సంకేతమా?
లేఖ లీక్ వ్యవహారం వదిలిపెట్టే అంశం కాదని ఆమె పేర్కొన్నారు. నేను రాసిన లేఖ బయటపడితే, సామాన్య కార్యకర్తల లేఖలు ఎలా ఉంటాయి? వాటి భద్రత ఏంటి? అన్న ప్రశ్న రాజకీయ పార్టీల్లో వ్యక్తిగత అభిప్రాయాలకి చోటు లేదన్న దృష్టికోణాన్ని విమర్శిస్తున్నట్టే ఉంది.

పార్టీ పునర్నిర్మాణమే అవసరమా?
ఆమె చెప్పిన మాటలు పార్టీలో ఉన్న చిన్న లోపాలను చర్చించుకోవాలి. సవరించుకోవాలి. కోవర్టులను పక్కకు నెట్టాలి. అప్పుడే పార్టీ పదికాలాల పాటు నిలబడుతుందన్న మాటలు పార్టీ పునర్నిర్మాణ అవసరం ఉందన్న సంకేతాల్ని ఇస్తున్నాయి. అది ఓ ధైర్యవంతమైన స్వీయ విమర్శలా? లేక పార్టీని లోపలినుంచి సరిదిద్దే యత్నమా? అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి.

కేసీఆర్ నాయకత్వం పైన కవిత విశ్వాసం
తన వ్యాఖ్యల చివర్లోనూ కవిత స్పష్టంగా చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఆయన నాయకత్వమే మా పార్టీకి మార్గదర్శకం. ఈ మాటలతో ఆమె తన విశ్వాసాన్ని పునరుద్ఘాటించినప్పటికీ, పరోక్షంగా పార్టీ అంతర్గత వ్యవస్థపై అనుమానాలు ఉద్భవించడాన్ని ఆమె కూడా ఊహిస్తున్నట్లుంది. కవిత లేఖ లీక్ వ్యవహారం తేలికగా తీసుకునే విషయం కాదు.

ఇది బీఆర్ఎస్‌లో నడుస్తున్న లోపాలు, అంతర్గత అసంతృప్తులపై వెలుగుపెడుతున్న అంశంగా మారింది. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న వ్యాఖ్య వాస్తవానికి రాజకీయంగా ఎంత దూరం వెళ్లుతుందో అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అంతలోనే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. బీఆర్ఎస్ లోపాలను ఎదుర్కొని నూతన దిశగా పయనించాలంటే, ఈ లేఖలు మేల్కొలిపే హెచ్చరికలా మారాలి. లేకపోతే.. లేఖలు కాదు, పార్టీలు లీక్ తో వీక్ అవుతాయి.

Also Read: BRS Kavitha: లేఖతో హీట్.. కవిత రీ ఎంట్రీతో ఎయిర్ పోర్ట్ లో హడావుడి!

బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కనిపించని కవిత
తెలంగాణ రాజకీయాల్లో వింతైన మౌనం చోటు చేసుకుంది. నిన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చినా, బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఒక్క ఫోటో, ఒక్క పోస్టు కనిపించలేదు. ఆమె మీడియాతో మాట్లాడినా.. ఆ మాటలు పార్టీలో ఎక్కడా ప్రస్తావించబడలేదు. ఈ మౌనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

బీఆర్ఎస్‌కు మౌనం ఎందుకు పట్టింది?
ఇప్పటివరకు పార్టీకి సంబంధించిన ప్రతి చిన్న కార్యక్రమం కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే బీఆర్ఎస్, ఇప్పుడు తన అధినేత కేసీఆర్ కూతురు ప్రయాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడమేనంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదే సమయంలో కవిత చేసిన వ్యాఖ్యలు “కేసీఆర్ దేవుడు.. కానీ చుట్టూ దయ్యాలు ఉన్నారు” అన్న వాక్యం పార్టీకి లోపలున్న అసంతృప్తిని స్పష్టం చేస్తోంది. అదే మౌనం బీఆర్ఎస్ సోషల్ మీడియా వ్యవహారానికీ ప్రతిబింబంగా మారిందని భావించవచ్చు.

కవిత, పార్టీ మధ్య గాపు?
కవిత లేఖ లీక్ వ్యవహారం తర్వాత పార్టీ కడపటిలా మౌనంగా ఉండటం వెనుక అంతర్గత విభేదాలేనా? లేక ఆమె స్వీయంగా వెనక్కి తగ్గాలనుకుంటున్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతటితో కాదు.. ఒక కీలక నేత, ముఖ్యంగా అధినేత కుటుంబ సభ్యురాలైన ఆమె ప్రెస్ మీట్‌ను పార్టీ పట్టించుకోకపోవడం ఏ మాత్రం సాధారణం కాదు. మరి దీనిపై బీఆర్ఎస్ లీడర్స్ ఏమంటారో వేచి చూడాలి.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×