OTT Movie : ఓటీటీలో ఇప్పుడు వస్తున్న మలయాళం సినిమాలపై ఓ కన్ను వేస్తున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు. ఈ సినిమాలు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ మలయాళం దర్శకులు తెరకెక్కించే విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక డిఫెరెంట్ లవ్ స్టోరీతో ముందుకు వచ్చింది. రీసెంట్ గానే ఈ మూవీ థియేటర్లలో సందడి చేసింది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మలయాళం మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
అభిలాష్ (సైజు కురుప్) ఒక కొరియర్ సర్వీస్ నడుపుతూ, అత్తర్ బాటిల్స్ ని కూడా అమ్ముతుంటాడు. అతను తన బాల్య స్నేహితురాలైన షెరిన్ మూసా (తన్వి రామ్) ను కొన్ని సంవత్సరాలుగా ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ఆవిషయం తనకి పైకి చెప్పలేకపోతాడు. అయితే షెరిన్ కి వేరే వ్యక్తి తో పెళ్లి జరిగిపోతుంది. ఆ తర్వాత ఒక కూతురు పుట్టాక ఆమె భర్త చనిపోతాడు. ఇక తన కూతురితో కలిసి స్వస్థలానికి తిరిగి వస్తుంది. ఆమె తిరిగి రావడంతో అభిలాష్ లో పాత ప్రేమ మళ్లీ చిగురిస్తుంది. అభిలాష్ తన ప్రేమను ఈసారి వ్యక్తపరచాలని నిశ్చయించుకుంటాడు. కానీ అతనికి ధైర్యం సరిపోకపోవడంతో మళ్ళీ వెనకడుగు వేస్తాడు. ఇలా ఉండగా, షెరిన్ తన స్నేహితుడికి పది అత్తర్ బాటిల్స్ ను విదేశాలకు పంపమని అభిలాష్ ని కోరుతుంది. ఇక్కడే స్టోరీ మలుపు తీసుకుంటుంది. అతను దీనివల్ల కొన్ని చట్టపరమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇందులో అభిలాష్ స్నేహితుడు, లాయర్ అయిన నవాస్ వల్లిక్కున్ను ఉద్దేశపూర్వకంగా సమస్యను పెంచుతాడు. అభిలాష్, షెరిన్ ని దగ్గర చేయడానికే అతను ఇలా చేస్తాడు. ఇప్పుడు స్టోరీ రసవత్తరంగా సాగుతుంది. చివరికి అభిలాష్ తన ప్రేమను వ్యక్తపరుస్తాడా ? లాయర్ ప్రయత్నం ఫలిస్తుందా ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ మలయాళం సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : పక్కింట్లో మర్డర్, ఫ్యూజులు అవుట్ అయ్యే క్లైమాక్స్ ట్విస్ట్… మెంటల్ గా వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని మూవీ
అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon Prime Video) లో
ఈ ఫీల్ గుడ్ మలయాళం మూవీ పేరు ‘అభిలాషం’ (Abhilasham). 2025 లో విడుదలైన ఈ మూవీకి షమ్జు జయబా దర్శకత్వం వహించారు. ఇందులో సైజు కురుప్, తన్వి రామ్, అర్జున్ అశోకన్, బిను పప్పు ప్రధాన పాత్రల్లో నటించారు. అభిలాష్ అనే వ్యక్తి చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.