Big Stories

Kavitha: అరెస్టుపై కవిత రియాక్షన్.. మాటల్లో భయం భయం!?

Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దూకుడుగా ఉంది. ఇద్దరు మంత్రుల అరెస్టుతో ఆప్ ఆగమాగం అవుతోంది. ఏకంగా డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియానే అరెస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆప్ శ్రేణులు బీజేపీ ఆఫీస్ ముందు ఆందోళన చేసినా ఎలాంటి ఇంపాక్ట్ లేదు. త్వరలోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సైతం అరెస్ట్ చేస్తారనే ప్రచారం మరింత సంచలనంగా మారుతోంది.

- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఢిల్లీకే పరిమితం కాలేదు. సౌత్ ఇండియాలోనే కింగ్ పిన్స్ అంతా ఉన్నారు. ఇప్పటికే ఏపీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కొడుకు రాఘవరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను ఓ దఫా విచారించింది. ఇక సీబీఐ నెక్ట్స్ మూవ్.. కవిత అరెస్టే అంటూ లీకులు వస్తున్నాయి. ఇప్పటికే ఛార్జిషీట్లో కవిత పేరును నాలుగుసార్లు మెన్షన్ చేసింది సీబీఐ. రేపోమాపో ఆమెను అరెస్ట్ చేస్తారంటూ కమలనాథులు పదే పదే వార్నింగులు ఇస్తున్నారు. దీంతో.. తనను అరెస్టు చేస్తారనే ప్రచారంపై కవితనే నేరుగా స్పందించారు.

- Advertisement -

“బీజేపీ నేతలు చెప్తే నన్ను అరెస్ట్ చేస్తారా?.. ఏ ఏజెన్సీలు, ఎప్పుడు అరెస్ట్ చేయాలనేది బీజేపీ వాళ్లే చెప్తారా? అలాంటప్పుడు దర్యాప్తు సంస్థలు ఉన్నవి ఎందుకు?” అని ప్రశ్నించారు కవిత. విపక్ష నేతలనే టార్గెట్ చేస్తున్నారని.. మోదీ వైఫల్యాలపై నిలదీస్తే ఏజెన్సీలతో భయపెడుతున్నారని మండిపడ్డారు. అదానీపై ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు చేయరు? అని నిలదీశారు కవిత.

తాను ఏ తప్పు చేయలేదని.. తనను ఎందుకు అరెస్ట్ చేస్తారనే యాంగిల్‌లో మాత్రం కవిత మాట్లాడకపోవడం ఆసక్తికరంగా మారింది. అంటే, తనను అరెస్ట్ చేస్తారని కవిత కూడా ఫిక్స్ అయ్యారా? ఆ అరెస్ట్ బీజేపీ వాళ్లు చెబితేనే చేస్తున్నారనేలా రాజకీయ విమర్శ చేశారా? మోదీని నిలదీసినందుకే తనను అరెస్ట్ చేయబోతున్నారంటూ రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారా? ఇలా ఎలా చూసినా.. అరెస్ట్‌పై కవితకు క్లారిటీ ఉన్నట్టే అనిపిస్తోందని అంటున్నారు. ఒకవేళ అరెస్ట్ తప్పకపోతే.. టాపిక్ ఢిల్లీ లిక్కర్ స్కాం మీదకు వెళ్లకుండా.. మోదీ, బీజేపీ, సీబీఐల మీదకు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని కమలనాథులు కౌంటర్ ఇస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News