
Sai Chand Wife: గాయకుడు సాయిచంద్ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. తీవ్ర దు:ఖసాగరంలో మునిగిపోయిన వారిని ఓదార్చారు. సాయిచంద్ భార్యను ఓదారుస్తూ.. కవిత కూడా కంటనీరు పెట్టుకున్నారు. ఆమెను ఓదార్చడం కవిత వల్ల కాలేదు. కుటుంబానికి అండగా ఉంటామని కంటనీరు తుడిచే ప్రయత్నం చేశారు. దు:ఖాన్ని దిగమింగుకుని వారికి భరోసా ఇచ్చారు. ఆ దృశ్యం అక్కడ ఉన్నవారిని సైతం తీవ్రంగా కలిచివేసింది.