BigTV English

SALAAR: ప్రభాస్ ఇన్ జురాసిక్ పార్క్.. కేజీఎఫ్‌లా సలార్ టీజర్..

SALAAR: ప్రభాస్ ఇన్ జురాసిక్ పార్క్.. కేజీఎఫ్‌లా సలార్ టీజర్..
salaar teaser

SALAAR: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ‘సలార్’ మూవీ టీజర్ ఈరోజు ఉదయం విడుదలైంది. ప్రశాంత్ నీల్ ను టాప్ లో నిలబెట్టిన కేజీఎఫ్ తరహాలోనే ‘సలార్’ టీజర్ కూడా పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ లా కనిపించింది. సీనియర్ యాక్టర్ టిన్ను ఆనంద్ చెప్పిన.. లయన్ , చీతా, టైగర్, ఎలిఫెంట్ వెరీ డేంజరస్.. బట్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్.. అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది.


సింహం, చీతా, పులి, ఏనుగు అత్యంత ప్రమాదకరమైనవి. కానీ జురాసిక్ పార్కులోని డైనోసర్ ను ఇవేమీ చెయ్యలేవు. దీంతో రెబల్ స్టార్ ప్రభాస్ ను మూవీలోని విలన్స్ ముందు డైనోసర్ తో పోల్చినట్లుగా టీజర్ లో ఉంది. అయితే టీజర్ లో ఎక్కడా ప్రభాస్ ని పూర్తిగా చూపించలేదు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ తోపాటు పృథ్వీరాజ్ సుకుమార్ కూడా కనిపించారు. టీజర్ ను పూర్తిగా యాక్షన్ పార్ట్ తో నింపేశారు. ఇందులో ఉన్న పోరాట సన్నివేశాలతోపాటు యాక్షన్ మూమెంట్స్ కూడా కేజీఎఫ్ ను గుర్తుకు తెస్తున్నాయి.

కేజీఎఫ్ ప్లేవర్ ను సలార్ లోనూ కొనసాగించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. నల్లటి మసి, దుబ్బ, దట్టమైన పొగలు, గనులు, బాంబులు, మట్టితో నిండిన ఫ్యాక్టరీ వాతావరణం, ఆలీవ్ గ్రీన్ వాహనాలు ఇలా అన్నీ సలార్ సినిమాను కేజీఎఫ్ 3 టీజర్ ఏమో అని అనిపించేలా కనిపించాయి. ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా శృతి హాసన్ గా నటిస్తుండగా.. మలయాళం నటుడు పృథ్విరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.


ప్రభాస్ బాహుబలి సిరీస్ తర్వాత తీసిన మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన సాహో, రాధాకృష్ణ డైరెక్ట్ చేసిన రాధేశ్యామ్.. ప్రభాస్ అభిమానులు మెప్పించలేకపోయాయి. రీసెంట్ గా జాతీయ అవార్డు దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణ ఇతిహాసంతో వచ్చిన ఆదిపురుష్ వివాదాస్పద చిత్రంగా మిగిలింది. అయితే సలార్ టీజర్ కూడా కేజీఎఫ్ తరహాలోనే కనిపించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో కొత్త భయం పట్టుకుంది. కేజీఎఫ్ ప్లేవర్ లో ప్రభాస్ ను పోల్చుకుంటే ఫలితం ఎలా ఉంటుందా..? అన్న భయం వారిలో వ్యక్తమవుతోంది.

Related News

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Big Stories

×