Big Stories

CSK Vs GT Highlights: గుజరాత్ టైటాన్స్ చిత్తు.. చెన్నై ఘనవిజయం!

Chennai Super Kings vs Gujarat Titans
Chennai Super Kings vs Gujarat Titans

Chennai Super Kings Vs Gujarat Titans Highlights: చెన్నై వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. చెన్నై బౌలర్లు రాణించడంతో గుజరాత్ చతికిల పడింది. 207 పరుగులు ఛేదించే క్రమంలో 143 పరుగులు చేసి 63 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యింది.

- Advertisement -

207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్‌కు 3వ ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. దీపక్ చాహర్ బౌలింగ్‌లో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(8) ఎల్బీగా వెనుదిరిగాడు. 21 పరుగులు చేసిన మరో ఓపెనర్ సాహా చాహర్ బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టాడు.

- Advertisement -

సాయి సుదర్శన్, విజయ్ శంకర్ ఇన్నింగ్స్‌ను చక్కబెట్టే ప్రయత్నం చేశారు. కానీ డేరిల్ మిచెల్ బౌలింగ్‌లో ధోనీ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కి విజయ్ శంకర్ డగౌట్‌కు చేరాడు. 21 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్ రహానే పట్టిన సూపర్ క్యాచ్‌కు అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత పతిరాణ బౌలింగ్‌లో 37 పరుగులు చేసిన సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వత ఓవర్లోనే ఒమర్‌జాయ్ పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 15.2 ఓవర్లుకు 118 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయిన గుజరాత్ ఓటమి అంచున నిల్చుంది. చివరి 4 ఓవర్లలో 88 పరుగులు చేయాల్సి రావడంతో గుజరాత్ ఒత్తిడిలోకి పోయింది. దీంతో రషీద్ ఖాన్ భారీ షాట్‌కు యత్నించి అవుట్ అయ్యాడు.

Also Read: MS Dhoni: వారెవ్వా.. ధోనీ స్టన్నింగ్ క్యాచ్‌..!

చివరకు 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసి 63 పరుగులు తేడాతో ఓడిపోయింది. చెన్నై బౌలర్లో దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ తలో రెండు వికెట్లు, డేరిల్ మిచెల్, పతిరాణ తలలో వికెట్ తీసుకున్నారు.

అంతకుముందు రచిన్ రవీంద్ర(46, 20 బంతుల్లో, 6X4, 3X6), శివమ్ దూబె(51, 23 బంతుల్లో; 2X4, 5X6) రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం 5.2 ఓవర్లలో 62 పరుగులు జోడించింది. రషీద్ ఖాన్‌ బౌలింగ్‌లో రచిన్ రవీంద్ర స్టంప్ అవుట్ అవ్వడంతో చెన్నై తొలి వికెట్ కోల్పోయింది.

Also Read: IPL 2024: శుభ్‌మన్ గిల్‌కు రూ. 12 లక్షల జరిమానా.. రిపీట్ అయితే ఒక మ్యాచ్ వేటు..

రెండో వికెట్‌కు 42 పరుగులు జోడించిన తర్వాత రహానే 12 పరుగులు చేసి సాయి కిశోర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శివమ్ దూబె వచ్చీ రాగానే గుజరాత్ బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 127 పరుగుల వద్ద రుతురాజ్ గైక్వాడ్(46, 36 బంతుల్లో; 5X4, 1X6) స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

ఈ దశలో 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న దూబె రషీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి అవుట్ అయ్యాడు. ఈ తరుణంలో బ్యాటింగ్‌కు వచ్చిన సమీర్ రిజ్వి ఎదుర్కున్న తొలి బంతినే సిక్స్‌గా మలిచాడు. 19వ ఓవర్ చివరి బంతిని కూడా సిక్స్‌గా మలిచి తొలి సిక్స్ గాలివాటం కాదని నిరూపించాడు. చివరి ఓవర్లో 8 పరుగులు రావడంతో చెన్నై 206 పరుగులు చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News