KCR Yagam: అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ డీలా పడిపోయింది. ఒకవైపు నేతలు పార్టీల నుంచి వెళ్లిపోవడం.. మరోవైపు కేసులు చుట్టుముట్టాయి. ఇది పైకి తెలిసి.. లోలోపల చాలా సమస్యలు వెంటాడు తున్నాయి. దీంతో కేసీఆర్ ఫ్యామిలీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వీటి నుంచి బయటపడేందుకు నానా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మహా యాగం తలపెట్టారు గులాబీ బాస్ కేసీఆర్.
కేసీఆర్ అంటే ముందుగా యాగాలు గుర్తుకు వస్తాయి. గడిచిన పదేళ్లలో ఆయన మహా యాగాలు ఎన్నో చేశారు. తెలంగాణ ప్రజల గురించి.. సొంత సమస్యలా అనేది సెకండ్ పాయింట్. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో వేద పండితుల ఆధ్వర్యంలో మహా యాగం చేపట్టారు కేసీఆర్ దంపతులు.
ALSO READ: మేడిగడ్డ బ్యారేజ్.. కేసీఆర్, ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు నోటీసులు
కొడుకు కేటీఆర్, కూతురు కవిత, మేనల్లుడు హరీష్‌రావు కొంత మంది కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఈ వ్యవహారం చాలా సీక్రెట్ చేస్తున్నారు పెద్దాయన. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయన్నది పార్టీ కార్యకర్తల మాట. రాజకీయంగా ప్రతికూల వాతావరణం ఏర్పడడంతో మహా యాగం చేయాలని నిర్ణయించడం, శుక్రవారం తలపెట్టడం జరిగిపోయింది.
తెలంగాణ అధికార మార్పిడి జరిగిన తర్వాత అనేక సమస్యలు గులాబీ బాస్‌ను వెంటాడుతున్నాయి. కేసీఆర్‌తో ముఖ్యనేతలపై రకరకాల కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన కవిత, 150 రోజుల తర్వాత ఇటీవల తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.
మరోవైపు పార్టీ నుంచి నేతలు వెళ్లిపోవడంతో ఏం చేయ్యాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మహాయాగంపై దృష్టిసారించారు. ఇంకోవైపు ప్రాజెక్టులు, విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణలు జరుగుతున్నాయి. వాటిని నుంచి ఆయన బయటపడలేకపోతున్నారు.. ప్రజల మధ్యకు రాలేకపోతున్నారు.
అన్నట్లు.. ఎనిమిదేళ్ల కిందట 2016లో ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో మహా రాజాశ్యామల యాగం చేశారు కేసీఆర్. దాని ఫలితాలు కొంతవరకు అనుకూలంగా వచ్చాయి. 2018లో మరోసారి అధికారంలోకి వచ్చారు కేసీఆర్. ఈసారి మాత్రం సమస్యల నుంచి బయటపడడానికి చేస్తున్నట్లు కొందరు నేతలు అంతర్గతంగా చెబుతున్నారు.
కేసీఆర్ ‘మహాయాగం’
సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో మహాయాగం చేపట్టిన కేసీఆర్.
ఫామ్‌హౌస్‌లో 2016లో మహారాజ శ్యామల యాగం చేసిన కేసీఆర్.#Brs #Kcr #ErravalliFarmHouse #Siddipet #NewsUpdates #Bigtv @BRSparty @KCRBRSPresident @TSwithKCR @KTRBRS @KTRoffice @BRSHarish pic.twitter.com/Ry9SidOVTK
— BIG TV Breaking News (@bigtvtelugu) September 6, 2024