Big Stories

Sharmila: షర్మిలపై పోటీకి భద్రమైన అభ్యర్థి!.. కేసీఆర్ వ్యూహాం ఏంటి?

Sharmila: ఇన్నాళ్లు షర్మిలను లైట్ తీసుకున్నారు. ఇప్పుడు కావాలనే హైప్ చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లే కాదు వైఎస్సార్ టీపీ కూడా ఉందనేలా ఉనికి చాటుతున్నారు. ప్రచారమైతే షర్మిలకే వస్తున్నా.. వ్యూహం మాత్రం కేసీఆర్దే అంటున్నారు. షర్మిల పార్టీకి వీలైనంత హైప్ ఇచ్చి.. ఓట్లను చీల్చి.. ఆ మేరకు లాభపడాలనేది గులాబీ బాస్ ఎత్తుగడ అని విశ్లేషిస్తున్నారు.

- Advertisement -

అయితే, ఎన్నికల వరకే షర్మిలతో పని. ఆ తర్వాత వైఎస్సార్టీపీని మాగ్జిమమ్ అణచిస్తారనడంలో సందేహమే లేదు. షర్మిలను సైతం ఓడించి.. తెలంగాణలో ఆ పార్టీ ఉనికే లేకుండా చేయాలనేది కేసీఆర్ స్ట్రాలజీ. తాను ఖమ్మం జిల్లా పాలేరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానంటూ ఇప్పటికే ఓపెన్ గా ప్రకటించేశారు షర్మిల. పాలేరులో పార్టీ కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తున్నారు.

- Advertisement -

పాలేరులో రెడ్డి ఆధిపత్యం ఎక్కువ. మైనార్టీలూ ఎక్కువే. అందుకే, సర్వేల ఆధారంగా షర్మిల పాలేరును సెలెక్ట్ చేసుకున్నారని అంటారు. దీంతో, షర్మిలను చిత్తుగా ఓడించేలా బలమైన నాయకుడిని బరిలో దించనున్నారట కేసీఆర్. ఆ మేరకు కేండిడేట్ ఎంపికపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చేశారని తెలుస్తోంది.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి వెంకటరెడ్డి గెలిచారు. ఆయన మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో మాత్రం తుమ్మల ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి ఆయనపై గెలుపొంది.. ఆ టీఆర్ఎస్ లో చేరారు. ఈసారి పాలేరు నుంచి షర్మిల బరిలో నిలవనుండటంతో.. ఆమెను ఎలాగైనా ఓడించాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది.

మునుగోడులో టీఆర్ఎస్, కమ్యూనిస్టుల పొత్తు.. బాగా వర్కవుట్ అయింది. అందుకే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీలు కలిసే నడుస్తాయని అంటున్నారు. అదే జరిగితే.. పాలేరును సీపీఎంకు కేటాయించి.. అక్కడి నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను బరిలో దించేలా చూడాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కామ్రేడ్లకు మంచి ఓటు బ్యాంకు ఉంది. గతంలో ఖమ్మం ఎంపీగానూ గెలిచారు తమ్మినేని. పాలేరుపైనా గట్టి పట్టుంది ఆయనకు. అందుకే, ఏరికోరి తమ్మినేని వీరభద్రం పేరును తెరమీదకు తీసుకొస్తాన్నారు కేసీఆర్. ఆయనైతే షర్మిలను ఓడించడం మరింత సులువు అవుతుందని.. టీఆర్ఎస్, సీపీఎం కలిస్తే గెలుపు ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పాలేరులో సర్వే కూడా చేయించిన కేసీఆర్.. గెలుపుపై ధీమాగా ఉన్నారని అంటున్నారు. అంతా బాగానే ఉందిగానీ.. తమకు టికెట్ ఇవ్వలేదని తుమ్మల నాగేశ్వరరావునో, సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డినో రెబెల్ గా మారితే..?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News