Big Stories

Ola Electric scooters : ఎలక్ట్రిక్ స్కూటర్ ఓనర్లకు ‘ఓలా’ గుడ్‌న్యూస్‌

Ola Electric scooters : ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్న వినియోగదారులకు ‘ఓలా’ గుడ్‌న్యూస్‌ చెప్పింది. S1, S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లకు MoveOS3ని వచ్చే వారం విడుదల చేస్తామని తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్‌ సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ ఈ మేరకు ట్వీట్ చేశారు.

- Advertisement -

MoveOS3కి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను త్వరలో తీసుకొస్తున్నట్లు ఈ ఏడాది దీపావళి రోజు ఓలా ప్రకటించింది. దీని ద్వారా స్కూటర్ల పనితీరు మెరుగవడమే కాదు… కొన్ని కొత్త ఫీచర్లు కూడా అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ఓలా S1 ఎయిర్‌ మాత్రమే MoveOS3తో వస్తుండగా… ఇకపై S1, S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లకూ అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.

- Advertisement -

కొత్త అప్‌డేట్‌ ద్వారా ఓలా స్కూటర్లలో హైపర్‌ ఛార్జింగ్‌ సదుపాయం వస్తుంది. దీనివల్ల కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో 50 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. దూర ప్రయాణాలు చేసేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. లాంగ్ డ్రైవ్ వెళ్లినప్పుడు కూడా ఛార్జింగ్ సమయం ఆదా అవుతుంది. ఓలా MoveOS3లో వస్తున్న మరో సదుపాయం… ప్రాక్సిమిటీ అన్‌లాక్‌. ఈ ఫీచర్‌ ద్వారా ఓలా స్కూటర్లను తాళం లేకుండానే వినియోగించొచ్చు. వాహనం దగ్గరికి కీ ఉన్న వ్యక్తి రాగానే… అది ఆటోమేటిక్‌గా ఆన్‌ అవుతుంది. దూరం వెళ్లినప్పుడు లాక్‌ అవుతుంది.

MoveOS3లో వస్తున్న మరో ఫీచర్‌ పార్టీ మోడ్‌. యూజర్‌ వినే సాంగ్‌ను బట్టి హెడ్‌లైట్స్‌ దానికి తగ్గట్లుగా వ్యవహరిస్తాయి. ఇందుకోసం ప్రొప్రైటరీ యాప్‌ ద్వారా అనుసంధానం కావాల్సి ఉంటుంది. అలాగే స్కూటర్‌ నడిపేటప్పుడు ఎవరైనా కాల్‌ చేస్తే… వారి పేరు డ్యాష్‌బోర్డు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానికి ఆటోరిప్లై కూడా ఇవ్వొచ్చు. వీటితో పాటు హిల్‌ అసిస్ట్‌ సదుపాయం కూడా కొత్తగా తీసుకొస్తున్నారు. అంటే… కొండ ప్రాంతాల్లో ఎగువకు ప్రయాణించాల్సి వచ్చినప్పుడు… బైక్ ఈజీగా ఎక్కేలా మార్పులు చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News