Maheshbabu:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు మహేష్ బాబు (MaheshBabu). ఈయనతో సినిమా అంటే చిన్నాచితకా సెలెబ్రిటీలే కాదు స్టార్ హీరో, హీరోయిన్లు కూడా ఆసక్తి కనబరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని.. ఈయన సినిమాలో ఒక అవకాశం రావాలి అని కోరుకుంటున్నారు కూడా. ఇలాంటి సమయంలో.. ఒక బిగ్ బాస్ బ్యూటీ మాత్రం మళ్లీ మళ్లీ అవకాశం అందుకుంటూ ఆశ్చర్యపరుస్తోంది. ఇది చూసిన నెటిజన్స్ లక్ అంటే ఈమెదే అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి మహేష్ బాబు నటించబోయే కొత్త మూవీలో అవకాశం అందుకున్న ఆ బిగ్ బాస్ బ్యూటీ ఎవరు? ఇదివరకే మహేష్ బాబుతో ఆమె ఏ సినిమా చేసింది? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
సూపర్ స్టార్ మూవీలో అవకాశం అందుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం బౌండరీ దాటి అంతర్జాతీయ స్థాయిలో సినిమా చేస్తున్నారు. అలా దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఎస్ ఎస్ ఎం బి 29 (SSMB 29) అనే వర్కింగ్ టైటిల్ తో ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలకపాత్ర పోషిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇప్పుడు మళ్లీ అవకాశాన్ని అందుకుంది బిగ్ బాస్ బ్యూటీ అశ్విని శ్రీ (Aswini shri). ఇదివరకే మహేష్ బాబు – రష్మిక (Rashmika ) కాంబినేషన్ లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో రష్మిక 2వ సిస్టర్ గా నటించింది అశ్విని శ్రీ. ఇంకొక సిస్టర్ గా హరితేజ ,తల్లిగా సంగీత నటించిన విషయం తెలిసిందే .ఆ సినిమాలో ఈమెకు పెద్దగా స్కోప్ లేకపోయినా అక్కడక్కడ స్క్రీన్ ప్రజెంట్ ఇచ్చి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ట్రైన్ సీన్లో వచ్చే సన్నివేశాలతో పాటు “హి ఇస్ సో క్యూట్” అనే పాటలో అక్కడక్కడ కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్లీ మహేష్ బాబు సినిమాలో అవకాశం అందుకోవడంతో అదృష్టం అంటే ఈమెదే అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
అశ్విని శ్రీ కెరియర్..
బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో 2.0 వెర్షన్ లో భాగంగా అశ్వినీ శ్రీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హైదరాబాద్ లో పుట్టి, వరంగల్ ఎన్ఐటిలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈమె.. ఇంస్టాగ్రామ్ లో వీడియోలు, రీల్స్ చేస్తూ కెరియర్ మొదలు పెట్టింది. ఇంస్టాగ్రామ్ లో “అరేబియన్ గుర్రం”గా తనను తాను సంబోధించుకున్న ఈమె.. 2016లో వినోదం 100% సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత బీటెక్ బాబులు, అమీర్పేటలో ఇలాంటి చిత్రాలలో నటించింది. అంతేకాదు పలు టెలివిజన్ సీరియల్స్ లో, మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించింది. బిగ్ బాస్ హౌస్ లో తన అందాలు ఆరబోసిన ఈ ముద్దుగుమ్మకి కనీసం ఎస్ ఎస్ ఎం బి 29 చిత్రంలోనైనా సరైన పాత్ర పడుతుందేమో చూడాలి.
also read:SSMB 29: షూటింగ్ సెట్ ఫోటోలను లీక్ చేసిన ప్రియాంక చోప్రా.. నమ్రత రియాక్షన్ చూసారా?