Big Stories

Khammam Petrol Bunk : పెట్రోల్ పంప్‌కు నిప్పు పెట్టిన దుండగులు..

Khammam : ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో కొందరు దుండగులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి భారత్ పెట్రోల్ బంక్‌లో ఒక పెట్రోల్ పంపునకు నిప్పు పెట్టారు. బంకు సిబ్బంది నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. పెట్రోల్ పంపు నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేయడంతో ముప్పు తప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

Latest News