Big Stories

TRS : ఎంపీ Vs ఎమ్మెల్యే .. మంత్రుల ఎదుటే మాటల యుద్ధం..

TRS : పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు టీఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది. మహబూబాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ..మంత్రుల ఎదుటే మాటల యుద్ధానికి దిగారు. కొత్తగా నిర్మించిన టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం వేదికగా ఈ ఇద్దరు నేతల మధ్య మాటల తుటాలు మరోసారి పేలాయి. ఈ కార్యాలయాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ పరిశీలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పార్టీ కార్యాలయ పనులను తానే సొంతంగా చేయించానని ఎమ్మెల్యే శంకర్ నాయక్ చెప్పడంతో వివాదం మొదలైంది. శంకర్ నాయక్ మాటలపై ఎంపీ కవిత ఫైర్ అయ్యారు. కార్యాలయం నిర్మాణ వ్యయాన్ని పార్టీనే భరిస్తోందని స్పష్టం చేశారు. ఇందులో ఎమ్మెల్యే చేసిందేమి లేదని తేల్చిచెప్పారు. దీంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం హీటెక్కింది. ఎంపీ, ఎమ్మెల్యేకు మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ సర్దిచెప్పడంతో తాత్కాలికంగా ఈ వివాదం సద్దుమణిగింది.

- Advertisement -

గతంలో ఎంపీ మాలోత్ కవిత, శంకర్ నాయక్ మధ్య వివాదం నడించింది. రైతు దీక్ష సభలో మాట్లాడుతున్న సమయంలో ఎంపీ కవిత చేతిలో నుంచి శంకర్ నాయక్ మైక్ లాక్కోవడం వివాదాస్పదమైంది.ఆ సమయంలో తామంటే తాము ముందు మాట్లాడాలని ఇద్దరు నేతలు పోటీపడ్డారు. ఈ ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరుపై పార్టీ నేతల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మంత్రుల ఎదుటే వాదించుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. కవిత , శంకర్ నాయక్ మధ్య ఆధిపత్య పోరు పార్టీకి నష్టం కలిగిస్తుందని గులాబీ నేతలు మదనపడుతున్నారు. ఈ నేతల ఇష్యూలో పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News