BigTV English

Telangana Temperature: కిల్లర్ సమ్మర్.. బయటకు వెళ్తే ఇక అంతే..!

Telangana Temperature: కిల్లర్ సమ్మర్.. బయటకు వెళ్తే ఇక అంతే..!

Temperature Creates New Records: అలర్ట్.. అలర్ట్.. 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటికి వెళుతున్నారా? అత్యవసరమైతే తప్ప ఆ పని చేయకండి. ఖాళీగా పడి రోడ్ల మీద తిరిగే వారు కాస్త కంట్రోల్‌లో ఉండండి. ఆఫీసులకు వెళ్లే వారు 11 లోపు వెళ్లిపోండి. సాయంత్రమయ్యే వరకు మీకు పని నచ్చినా.. నచ్చకున్నా.. బాస్ తిట్టినా.. అవసరమైతే కొట్టినా సరే.. బయటికి రాకండి. కాదని వచ్చారో.. చచ్చారే.. ఎందుకంటే భానుడు మండిపోతున్నాడు. నిప్పుల వాన కురిపిస్తున్నాడు. నిలుచున్న చోటే లిపోయేలా చేస్తున్నాడు.


ఎండాకాలం.. మాములుగానే మనకు మండిపోతుంది. టెంపరేచర్‌ 47 డిగ్రీల వరకు వెళుతుంది. ఈ పరిస్థితి మరో నాలుగు రోజులు ఉంటుందని చెబుతుంది వాతావరణశాఖ. అత్యవసరమైతే తప్ప.. అస్సలు బయటికి రావొద్దని చెబుతోంది. వృద్ధులు, చిన్నారులైతే మరింత జాగ్రత్త అంటూ డేంజర్ బెల్స్‌ మోగిస్తుంది. ప్రస్తుతం మిట్ట మధ్యాహ్నమైతే ఆ వెలుగును చూసేందుకు కళ్లు కూడా అడ్జెస్ట్‌ కాలేనంతగా ఉంటుంది ఎండ. తెలుగు స్టేట్స్‌లో టెంపరేచర్స్ రికార్డ్స్ బద్దలు కొడుతున్నాయి. ఈ భరించలేని ఎండలకు తోడు గాలులు తోడవడంతో.. ఇప్పుడు వడగాలులు తీవ్రమయ్యాయి. తెలంగాణ, ఏపీలో వందకు పైగా మండలాల్లో వడగాలులు వీచాయని అఫీషియల్‌గా వాతావరణశాఖే చెబుతుంది.

నిజానికి గతంలో ఎండా కాలంలో మధ్యాహ్నం అయితే కానీ టెంపరేచర్‌ పీక్స్‌కు చేరేది కాదు. కానీ ఇప్పుడా సీన్ కనిపించడం లేదు. ఉదయం 8 గంటల నుంచే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వడదెబ్బతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎండదెబ్బ తగలకుండా క్యాప్, గొడుగు, టవల్‌లో ఏదో ఒక దానితో మీ తలను కవర్ చేసుకోండి. కాటన్‌ డ్రెస్సెస్‌ వేసుకోవడానికి ప్రియారిటీ ఇవ్వండి. వృద్ధులు, ప్రెగ్నెంట్ లెడీలు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుండి. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకపోవడమే మంచిది. ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోవాలని డాక్టర్స్‌ సజెస్ట్ చేస్తున్నారు.


Also Read: Telangana Weather Updates: వడదెబ్బతో ఆరుగురు మృతి.. నేడు కూడా రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలు

ఎండల దెబ్బలకు ప్రస్తుతం ప్రధాన రిజర్వాయర్లన్ని దాదాపుగా అడుగంటిపోయాయి. చాలా ఊళ్లల్లో చెరువులు, కుంటలకు బీటలు వచ్చాయి. నల్లమల అటవీ ప్రాంతం.. ఓపెన్ ఫారెస్ట్ ప్రాంతాల్లో వన్యప్రాణులు తండాలు, గ్రామాల్లోకి వస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటితో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. నిజానికి ఏప్రిల్‌ రెండో వారం నుంచే ఉష్ణోగ్రత 40 డిగ్రీలను దాటేసింది. అయితే ఉపరితల ద్రోణి కారణంగా అక్కడక్కడ వర్షాలు కురిశాయి. కాస్త ఉపశమనం దొరికింది అనుకునే సరికి మళ్లీ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడం స్టార్ట్ చేశాడు.

ముఖ్యంగా భాగ్యనగర వాసులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం హైదరాబాద్‌లో రాబోయే ఐదు రోజులు ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంది. ఏప్రిల్‌లో నమోదైన ఉష్ణోగ్రతల కంటే ఇది ఏకంగా 4 నుంచి 5 డిగ్రీలు ఎక్కువ. సింపుల్‌గా నాలుగు, ఐదు అని చెబుతున్నాం కానీ, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఇప్పటికే మీరంతా చూస్తూనే ఉన్నారు.

Also Read: రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు.. ఆల్‌టైం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సౌత్‌ ఇండియాలో ఇదే సీన్ కనిపిస్తుంది. కేరళ, కర్ణాటకలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కేరళలో హీట్‌ వేవ్స్‌ ఎక్కువగా ఉన్నాయి. పాలక్కాడ్, మలప్పురం, అలప్పుజాలో పలువురు మరణించారు.

కాబట్టి మరో నాలుగైదు రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైతే ఎండను అవాయిడ్‌ చేయండి.. ఎప్పుడూ నీడ పట్టున ఉండేలా ప్లాన్ చేసుకోండి. పనిని పోస్ట్‌పోన్ చేయవచ్చు.. కాదని తెగిస్తే హాస్పిటల్‌కు చేరాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ప్రాణాలే పోయే పరిస్థితి రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

Tags

Related News

Hyderabad News: బతుకమ్మకుంటకు పూర్వవైభవం.. సీఎం రేవంత్ చేతుల మీదుగా ఓపెన్

Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో దంచికొడుతున్న భారీ వర్షం.. ఈ ప్రాంతాలన్నీ జలమయం

Weather Alert: బలపడిన వాయుగుండం.. మరో మూడు రోజులు నాన్‌స్టాప్ వర్షాలు.. బయటకు రాకండి

TGSRTC Dasara Offer: బస్సెక్కితే బహుమతులు.. దసరాకు టీజీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

Hyderabad Metro: రేవంత్ సర్కార్ చేతికి మెట్రో తొలి దశ ప్రాజెక్ట్.. రూ.13వేల కోట్లను టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TGPSC Group-1: గ్రూప్-1 ఉద్యోగం సాధించిన వారికి శుభవార్త.. ఈ 27న సీఎం చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్

Weather News: నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక.. పిడుగులు పడే ఛాన్స్

Ganja Seized: గచ్చిబౌలిలో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

Big Stories

×