E-Paper
Advertisement

రాహుల్ గజం ఎగిరితే.. రేవంత్ రెండు గజాలు ఎగురుతున్నాడు!: కిషన్ రెడ్డి

రాహుల్ గజం ఎగిరితే.. రేవంత్ రెండు గజాలు ఎగురుతున్నాడు!: కిషన్ రెడ్డి
Advertisement

Kishan Reddy: ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడిన ఆయన, రాజ్యాంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు డ్రామాలకు తెరలేపాయని విమర్శించారు.

రాహుల్ గాంధీ డ్రామాలు.. రేవంత్ ఓవరాక్షన్!

Advertisement

ఎన్నికల్లో గెలవలేకనే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నేతలు రాజ్యాంగ సంస్థలపై దండయాత్ర చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. గతంలో లోక్‌సభ స్పీకర్ రాజీనామా చేయాలంటూ నవ్వులపాలైన రాహుల్, ఇప్పుడు సీఈసీ రాజీనామా కోసం రోజూకో నాటకం ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏకంగా సుప్రీంకోర్టు సీజేఐనే రాజీనామా చేయాలనడం సిగ్గుచేటని, వేలాది మందితో సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయమూర్తులపై ఒత్తిడి తెచ్చి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఇక ఢిల్లీలో రాహుల్ గాంధీ గజం ఎగిరితే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు గజాలు ఎగురుతున్నారంటూ విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్‌లోనూ ఆంక్షలేనా?

Advertisement

తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏ ధర్నా చేయాలన్నా గృహనిర్బంధాలు చేస్తున్నారని, చివరికి హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకోవాల్సిన దుస్థితి హైదరాబాద్‌లో నెలకొందని వాపోయారు. ఇక్కడ అనుమతులు ఇవ్వకుండా, ఢిల్లీ వచ్చి మాత్రం నీతులు చెబుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.

జంతర్ మంతర్ ఆందోళనలపై స్థానికుల ఇబ్బందులు

ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రాంతంలో నిత్యం జరిగే ఆందోళనల వల్ల స్థానిక ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళనకర వాతావరణంలో ఢిల్లీ ప్రజలు బతుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జంతర్ మంతర్‌ను మరో ప్రాంతానికి మార్చాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని ఆయన స్పష్టం చేశారు.

Also Read: క్యూర్ చట్టం ఎఫెక్ట్‌.. మున్సిపల్ పాలనలో ఇక అంతా పబ్లిక్‌!

Tags

Related News

సింగరేణి కార్మికులకు డిప్యూటీ సీఎం బంపర్ ఆఫర్.. దసరా బోనస్ ఎంతంటే?

తెలంగాణలో గుబులు రేపుతున్న ఫేక్ సర్టిఫికెట్ల అంశం.. షాకింగ్ విషయాలు వెలుగులోకి, బీఆర్ఎస్‌లో వణుకు మొదలు

క్యూర్ చట్టం ఎఫెక్ట్‌.. మున్సిపల్ పాలనలో ఇక అంతా పబ్లిక్‌!

నోటీసులు లేకుండానే ఓట్లు తొలగిస్తారా? సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే తొలగించాలి!- కూనంనేని

ఏం పీక్కుంటారు అన్న కేటీఆర్ ఇప్పుడు గడగడ వణికిపోతున్నాడు!- ఆది శ్రీనివాస్

అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏసీబీ వల.. రూ.20 లక్షల లంచం కేసులో తహశీల్దార్, సర్వేయర్ అరెస్ట్

ORRపై ఘోర ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ మృతి!

Big Stories

Advertisement
×